Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేరీ మాటి మేరా దేశ్: కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అమరవీరులైన వీర యోధులకు సన్మానం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం 'మేరీ మాటి మేరా దేశ్' ప్రచారాన్ని ప్రకటించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోడీ మన్ కీ బాత్(Mann ki Baat) కార్యక్రమం ద్వారా ఆల్ ఇండియా రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడుతున్న విషయం తెలిసిందే.

ఈ వారం 103 ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. మేరీ మాటి మేరా దేశ్(Meri Mati Mera Desh) పేరుతో కొత్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

modi1

'అమృత్ మోహత్సవ్' ప్రతిచోటా ప్రతిధ్వనించడం, ఆగస్ట్ 15 సమీపంలో.. దేశంలో పెద్ద ప్రచారం 'మేరీ మతి మేరా దేశ్' ప్రారంభించబడుతుందని ఆయన అన్నారు. 'అమరవీరులకు గౌరవ సూచకంగా దేశంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక శాసనాలను ఏర్పాటు చేస్తాం. దీంతోపాటు అమృత్ కలశ యాత్ర పేరుతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7500 కలశాల్లో మట్టి, మొక్కలను సేకరించి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్తూపం పక్కనే అమృత్ వాటిక పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మించనున్నాం' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

ఏక భారత్ శ్రేష్ట్ భారత్‌కు ప్రతీకగా ఈ అమృత్ వాటిక నిలుస్తుందని ప్రధాని చెప్పారు. అకాల వర్షాల కారణంగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడిన తీరును ప్రధాని మోడీ అభినందించారు. తన రేడియో ప్రసంగంలో, మోడీ గత కొన్నేళ్లుగా హజ్ విధానంలో ప్రభుత్వం చేసిన మార్పులను కూడా ప్రశంసించారు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు వార్షిక తీర్థయాత్రకు వెళ్ళే అవకాశాన్ని పొందుతున్నారని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+