వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ వైద్యుడి అరెస్టు

ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పనిచేసి రిటైర్ అయిన సమీర్ బిస్వాస్‌ను పోలీసులు అసన్‌సోల్‌లోని మహిశిల కాలనీలో గల బంధువుల ఇంటిలో గత రాత్రి అరెస్టు చేశారు. 2010 ఆగస్టు నుంచి బిస్వాస్ పరారీలో ఉన్నాడు. కిషన్‌జీతో పాటు ఇతర మావోయిస్టులకు వారి అటవీ ప్రాంతాల్లోని స్థావరాల్లో వైద్యం చేస్తూ వచ్చాడని, వారితో సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
పోలీసులు ఇసిఎల్ హౌసింగ్ కాలనీ పచఘోరియాలోని ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారని పిటిఐ వార్తాకథనం తెలియజేస్తోంది.
కిషన్‌జీ 2011 నవంబర్‌లో సంయుక్త బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని దట్టమైన బురిసోల్ అడవుల్లో హతయమ్యాడు.