Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Marriage: రాత్రి ఇంటికి రాకుండా తిరుగుతున్న కేఏఎస్ అధికారి, మ్యాటర్ లాగిన రెండో భార్య, క్లైమాక్స్ !

బెంగళూరు: ఐఏఎస్ అధికారి తరువాత దాదాపు అంతటి హోదా ఉన్న కేఏఎస్ అధికారి ఉన్నతస్థాయి పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పటికే వివాహం చేసుకున్న కేఏఎస్ అధికారి ఆయన భార్యతో సంతోషంగా కాపురం చేశారు. ఐటీ హబ్ లో విధుల్లో ఉన్న అధికారికి ఓ మహిళ పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం రానురాను చనువుగా మారింది. తన భార్యకు తాను విడాకులు ఇచ్చేశానని, ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న తాను ఒంటరిగా ఉన్నానని ఆయన స్నేహితురాలికి చెప్పాడని తెలిసింది. ఇదే సమయంలో కేఏఎస్ అధికారిగా ఉద్యోగం చేస్తున్న స్నేహితుడిని రెండో పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్దం అయ్యారు. గుడిలో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంతసన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఇద్దరి పెళ్లి జరిగిపోయింది.

రెండో పెళ్లి చేసుకున్న కేఏఎస్ అధికారి రెండో భార్య ఇంట్లోనే కాపురం పెట్టాడు. రానురాను ఆయనగారు రాత్రిపూట ఎక్కువగా బయట కాలం గడపడం మొదలు పెట్టారు.కేఏఎస్ అధికారి గురించి ఆయన రెండో భార్య ఆరా తీసింది. తన భర్త మొదటి భార్య దగ్గరకు వెళ్లి వస్తున్నాడని, ఆమెకు ఇంకా విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్న రెండో భార్య రగిలిపోయింది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని కేఏఎస్ అధికారి మీద ఆయన రెండో భార్య కేసు పెట్టడం ఇప్పుడు కలకలం రేపింది. అయితే సదరు కేఏఎస్ అధికారి మీడియాకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారని స్థానిక మీడియా అంటోంది.

 బెంగళూరులో కేఏఎస్ అధికారి

బెంగళూరులో కేఏఎస్ అధికారి

ఐఏఎస్ అధికారి తరువాత కర్ణాటకలో దాదాపు అంతటి హోదా ఉన్న కేఏఎస్ అధికారి వీరభద్రస్వామి బెంగళూరులో ఉన్నతస్థాయి పదవిలో కొనసాగుతున్నారు. బీబీఎంపీ దక్షిణ విభాగం జాయింట్ కమీషనర్ గా వీరభద్రస్వామి విధుల్లో ఉన్నారు. ఇప్పటికే వివాహం చేసుకున్న కేఏఎస్ అధికారి వీరభద్రస్వామి ఆయన భార్యతో సంతోషంగా కాపురం చేశారని తెలిసింది.

 మహిళ ఎంట్రీ

మహిళ ఎంట్రీ

బెంగళూరులోని బసవనగుడి సమీపంలో ఓ మహిళ నివాసం ఉంటున్నారు. 2020లో వీరభద్రస్వామికి ఆమెకు పరిచయం అయ్యింది. ఐటీ హబ్ లో విధుల్లో ఉన్న కేఏఎస్ అధికారి వీరభ్రదస్వామికి, బసవనగుడికి చెందిన మహిళ పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం రానురాను చనువుగా మారింది. తన భార్యకు తాను 11 సంవత్సరాల క్రితం విడాకులు ఇచ్చేశానని, ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న తాను ఒంటరిగా ఉన్నానని వీరభద్రస్వామి ఆయన స్నేహితురాలికి చెప్పాడని తెలిసింది.

 గుడిలో పెళ్లి

గుడిలో పెళ్లి

ఇదే సమయంలో కేఏఎస్ అధికారిగా ఉద్యోగం చేస్తున్న స్నేహితుడు వీరభద్రస్వామిని రెండో పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్దం అయ్యారు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో హుళిమావు- బన్నేరుఘట్ట మెయిన్ రోడ్డులోని ఓ గుడిలో కుటుంబ సభ్యులు, బంధువులు, అత్యంతసన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరభద్రస్వామి, ఆ మహిళ పెళ్లి జరిగిపోయింది. రెండో పెళ్లి చేసుకున్న కేఏఎస్ అధికారి వీరభద్రస్వామి ఆయన రెండో భార్య ఇంట్లోనే కాపురం పెట్టాడు.

 భర్త అసలు మ్యాటర్ లీక్

భర్త అసలు మ్యాటర్ లీక్

రానురాను వీరభద్రస్వామి రాత్రిపూట ఎక్కువగా బయట కాలం గడపడం మొదలు పెట్టారు.కేఏఎస్ అధికారి వీరభద్రస్వామి గురించి ఆయన రెండో భార్య ఆరా తీసింది. తన భర్త వీరభద్రస్వామి ఆయన మొదటి భార్య దగ్గరకు వెళ్లి వస్తున్నాడని, ఆమెకు ఇంకా విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్న రెండో భార్య రగిలిపోయింది.

Recommended Video

    China Crazy Things | Chilli Pepper Festival | Street Food | Vampire Teeth | Oneindia Telugu
     కేఏఎస్ అధికారి మీద కేసు పెట్టిన రెండో భార్య

    కేఏఎస్ అధికారి మీద కేసు పెట్టిన రెండో భార్య

    తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని కేఏఎస్ అధికారి వీరభద్రస్వామి మీద ఆయన రెండో భార్య బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం ఇప్పుడు కలకలం రేపింది. అయితే సదరు కేఏఎస్ అధికారి వీరభద్రస్వామి ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని, మీడియాకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారని కన్నడ మీడియా అంటోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+