Marriage: లవ్ మ్యారేజ్, నెల కాకుండానే భార్యతో కలిసి శవమైన టీవీ చానల్ కెమోరామెన్, మ్యాటర్ ?
బెంగళూరు/విజయపుర: ప్రముఖ టీవీ న్యూస్ చానల్ లో ఓ యువకుడు కెమెరామెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమికులు సంతోషంగా తిరిగారు. టీవీ చానల్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకోవడానికి వీలులేదని అమ్మాయి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. యువకుడి కుటుంబ సభ్యులు సేమ్ డైలగ్ చెప్పారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు స్నేహితుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టారు. వివాహం చేసుకుని నెల రోజులు కాకుండానే నవదంపతులు ఇద్దరూ ఒకేసారి శవమై కనిపించారు.

బెంగళూరులో ఉద్యోగం
ప్రముఖ కన్నడ టీవీ న్యూస్ చానల్ లో తిప్పన్న హోసమని (34) అనే యువకుడు కెమెరామెన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులోని హెడ్ ఆఫీస్ లోనే తిప్పన ఉద్యోగం చేస్తున్నాడు. టీవీ చానల్ కెమెరా మెన్ గా ఉద్యోగం చేస్తున్న తిప్పన్న మంచి జీతం తీసుకుంటున్నాడు. బెంగళూరులోనే తిప్పన్న నివాసం ఉంటున్నాడు.

ప్రేమలో పడిన కెమెరామెన్
తిప్పన సొంత ఊరు విజయపుర జిల్లాలోని ముద్దేబిహాళ పట్టణం. విజపుర జిల్లాలోని ముద్దేబిహాళ పట్టణంలో నివాసం ఉంటున్న సుజాత (30) అనే యువతిని తిప్పన్న ప్రేమించాడు. కొన్ని నెలల క్రితం సుజాత కూడా తిప్పన ప్రేమకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. బెంగళూరు నుంచి సొంత ఊరికి వెళ్లి తిప్పన అతని ప్రియురాలితో సంతోషంగా తిరిగాడు.

పెద్దలు రివర్స్..... గుడిలో పెళ్లి
టీవీ చానల్ లో ఉద్యోగం చేస్తున్న తిప్పన్నను పెళ్లి చేసుకోవడానికి వీలులేదని సుజాత కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. తిప్పన కుటుంబ సభ్యులు కూడా సుజాతతో పెళ్లి చేసుకోవడానికి వీలులేదని చెప్పారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు తిప్పన, సుజాత 23 రోజుల క్రితం ముద్దేబిహాళ పట్టణం సమీపంలోని గుడిలో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టారు.

నెల కాకుండానే శవాలైన నవదంపతులు
పెళ్లి చేసుకున్న తరువత తిప్పన, సుజాత హ్యాపీగా ఉన్నారు. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా పూర్తి కాకుండానే తిప్పన, సుజాత దంపతులు వారి నివాసం ఉంటున్న ఇంటిలో ఉరి వేసుకుని శవలై కనిపించడం కలకలం రేపింది. తిప్పన, సుజాత పెళ్లిని వ్యతిరేకించిన పెద్దలు వారిని బెదిరించారని తెలిసింది. తిప్పన, సుజాత ఆత్మహత్య చేసుకున్నారా ? ఇద్దరిని చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించారా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications