Marriage: పెళ్లి జరిగిన మూడు రోజులకే పెళ్లి కొడుకు మృతి, పెళ్లి కూతురితో సహ ఒకే ఫ్యామిలీలో 9 మంది కరోనా !

లక్నో/ ఉత్తరప్రదేశ్: పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు మూడు రోజుల్లో అనారోగ్యంతో పైలోకాలకు వెళ్లిపోయాడు. పెళ్లి జరిగిన ఇంట విషాదం వెలుగు చూసిన సమయంలోనే పెళ్లి కుమార్తెతో పాటు ఆమె కుటంబంలో ఏకంగా 9 మందికి కరోనా పాజిటివ్ (COVID-19) అని వెలుగు చూడటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లికి వెళ్లిన వాళ్లు షాక్ అయ్యారు. అయితే ఇంత వరకు పెళ్లి కొడుక్కి కరోనా వైరస్ ఉందా ?, లేదా ? అనే విషయం మాత్రం పక్కా క్లారిటీ లేదని అధికారులు అంటున్నారు.

 హ్యాపీగా పెళ్లి జరిగింది

హ్యాపీగా పెళ్లి జరిగింది

ఉత్తరప్రదేశ్ లోని లక్నో సమీపంలో 10 రోజుల క్రితం ఓ యువతి, యువకుడి చాల హ్యాపీగా పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లికి వెళ్లిన వాళ్లు నవదంపతులను సంతోషంగా దీవించి ఎవరిపాటికి వాళ్లు వెళ్లిపోయారు. జంట చూడముచ్చటగా ఉందని అందరూ భావించారు.

 మూడు రోజుల్లో పెళ్లి కొడుకు మృతి

మూడు రోజుల్లో పెళ్లి కొడుకు మృతి

పెళ్లి జరిగిన తరువాత నవదంపతుల ఫస్ట్ నైట్ సాఫీగా సాగిపోయింది. మూడు రోజుల పాటు పెళ్లి కుమార్తెతో సంతోషంగా సంసారం చేసిన పెళ్లి కొడుకు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచాడు. పెళ్లి కొడుకు అనారోగ్యంతో మరణించాడని అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. పెళ్లి జరిగిన మూడు రోజులకే పెళ్లి కొడుకు చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి.

 9 మందికి కరోనా పాజిటివ్

9 మందికి కరోనా పాజిటివ్

పెళ్లి జరిగిన మూడు రోజులకే పెళ్లి కొడుకు చనిపోయాడని ఆ ప్రాంతం మొత్తం తెలిసిపోయింది. స్థానిక ఆరోగ్య శాఖ అధికారులకు అనుమానం వచ్చి పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో పాటు పెళ్లి కుమార్తె, ఆమె కుటుంబ సభ్యులు అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పెళ్లి కుమార్తె, ఆమె అత్తామామలు. మరిదితో పాటు మొత్తం ఒకే కుటంబంలో 9 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అందరూ హడలిపోయారు.

 పెళ్లి కొడుకు విషయంలో క్లారిటీ లేదు

పెళ్లి కొడుకు విషయంలో క్లారిటీ లేదు

పెళ్లి కుమార్తెతో పాటు ఒకే కుటంబంలో 9 మందికి కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలోని వాళ్లు షాక్ అయ్యారు. పెళ్లి కుమారుడికి కోవిడ్ పరీక్షలు నిర్వహించకుండానే పెళ్లి చేశారని అధికారులు అంటున్నారు. అయితే పెళ్లి కొడుకు కరోనా వైరస్ తో చనిపోయాడా ?, అతనికి కరోనా వైరస్ ఉందా ?, లేదా ?, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదని ఓ అధికారి చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. పెళ్లి కుమారుడు చనిపోవడం, పెళ్లి కుమార్తెతో పాటు మొత్తం 9 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ పెళ్లికి వెళ్లిన వాళ్లు ఇప్పుడు కోవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి ఆసుపత్రులకు క్యూ కట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+