Marriage: అన్న ఫ్రెండ్ తో చెల్లెలు లవర్ మ్యారేజ్, పెళ్లి కొడుకుని లేపేసిన బావ, మధ్యలో ఆస్తిలో భాగం గొడవ !

చెన్నై/క్రిష్ణగిరి: చిన్నప్పటి నుంచి ఇద్దరు యువకులు కలసిమెలసి తిరుగుతున్నారు. వయసులో మూడు సంవత్సరాలు తేడా ఉన్నా ఇద్దరు యువకులు ఒరేయ్ ఓరేయ్ అని పిలుచుకుంటున్నారు. ఇదే సమయంలో స్నేహితుడి ఇంటికి వచ్చి వెలుతున్న యువకుడు అతని సోదరిని ప్రేమించాడు. యువతి కూడా సోదరుడి ఫ్రెండ్ తో ప్రేమలో పడింది. ఇద్దరూ మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇటీవల తన సోదరి తన స్నేహితుడిని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఆమె సోదరుడు రగిలిపోయాడు. ఇద్దరు స్నేహితులు శత్రువులు అయ్యారు. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. ఇదే సందర్బంలో లవ్ మ్యారేజ్ చేసుకన్న యువతికి, ఆమె సోదరుడికి ఆస్తి పంపకాల విషయంలో గొడవలు అయ్యాయి. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్న సమయంలోనే యువకుడు అతని సోదరిని లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

క్లోజ్ ఫ్రెండ్స్

క్లోజ్ ఫ్రెండ్స్

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని సూలగిరి సమీపంలోని బి. కొత్తపల్లిలో సంతోష్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుముదేపల్లిలో నివాసం ఉంటున్న మురుగేషన్ (26) అనే యువకుడు, సంతోష్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి సంతోష్, మురుగేషన్ ఇద్దరూ కలసిమెలసి తిరుగుతున్నారు. వయసులో మూడు సంవత్సరాలు తేడా ఉన్నా సంతోష్, మురుగేషన్ ఒరేయ్ ఓరేయ్ అని పిలుచుకుంటున్నారు

 ఫ్రెండ్ చెల్లెలితో లవ్

ఫ్రెండ్ చెల్లెలితో లవ్

మురుగేషన్ ఇంటికి సంతోష్ అప్పుడప్పుడు వెళ్లి వస్తున్నాడు. ఆ సందర్బంలో మురుగేషన్ చెల్లెలు మీనా సంతోష్ కు పరిచయం అయ్యింది. ఇదే సమయంలో స్నేహితుడు మురుగేషన్ ఇంటికి వచ్చి వెలుతున్న సంతోష్ మీనాను ప్రేమించాడు. మీనా కూడా సంతోష్ తో ప్రేమలో పడింది. సంతోష్, మీనా మూడు సంవత్సరాల నుంచి సీక్రేట్ గా ప్రేమించుకుంటున్నారు.

లవ్ మ్యారేజ్ చేసుకున్న యువతి

లవ్ మ్యారేజ్ చేసుకున్న యువతి


కొన్ని నెలల క్రితం తన సోదరి మీనా నా స్నేహితుడు సంతోష్ ను ప్రేమిస్తుందని తెలుసుకున్న ఆమె సోదరుడు మురుగేషన్ రగిలిపోయాడు. తరువాత సంతోష్, మురుగేషన్ శత్రువులు అయ్యారు. కొన్ని నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయిన మీనా ఆమె ప్రేమికుడు సంతోష్ ను పెళ్లి చేసుకుంది.

 చెల్లెలి భర్త హత్యకు స్కెచ్

చెల్లెలి భర్త హత్యకు స్కెచ్

ఇటీవల లవ్ మ్యారేజ్ చేసుకన్న మీనాకు, ఆమె సోదరుడు మురుగేషన్ కు ఆస్తి పంపకాల విషయంలో గొడవలు అయ్యాయి. ఆస్తి అమ్మడానికి మీనా, సంతోష్ నిరాకరించారు. ఇదే విషయంలో సంతోష్, మురుగేషన్ గొడవపడి కొట్టుకున్నారు. ఎలాగైనా తన చెల్లెలు మీనా భర్త సంతోష్ ను చంపేసి ఆస్తి సొంతం చేసుకోవాలని మురుగేషన్ స్కెచ్ వేశాడు.

వెంటాడి వెంటాడి చంపేశారు

వెంటాడి వెంటాడి చంపేశారు

సాయంత్రం సంతోష్ పని ముగించుకుని బైక్ లో ఇంటికి బయలుదేరాడు. మార్గం మద్యలో మురుగేషన్, అతని ఫ్రెండ్ సాయి, ఇంటర్ చదువుతున్న కుమార్ (మైనర్) అనే ముగ్గురు సంతోష్ ను అడ్డగించి దాడి చేశారు. ఆ సందర్బంలో వారి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన సంతోష్ ను వెంటాడి పట్టుకుని కత్తులతో పొడిచి చంపేశారు. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్న సమయంలోనే యువకుడు అతని అక్కను లవర్ మ్యారేజ్ చేసుకున్న యువకుడిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+