Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోదీని, భారత్ ను అంతం చేస్తా: మసూద్ అజహర్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేసింది. 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలపై భీకర దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు భారత రక్షణశాఖ పేర్కొంది.

అయితే భారత్ జరిపిన ఈ దాడుల్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ కుటుంబం హతం అయింది. మసూద్ కు చెందిన బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. మసూద్ ఫ్యామిలీలో మొత్తం 14 మంది హతం అయినట్లు ఆయనే వెల్లడించాడు. మరో నలుగురు ఆయన అనుచరులు కూడా మృతి చెందారు.

Masood Azhar Issues New Threat Against PM Modi and India

అయితే 'ఆపరేషన్ సిందూర్' దాడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ఖండించాడు. భారత్ పై విషం కక్కాడు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధం నియమాలను ఉల్లంఘించారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం, నిరాశ లేదన్నాడు. భయం, విచారం కూడా లేదని తెలిపాడు.

ఈ మేరకు ప్రధాని మోదీని, భారత్ ను నాశనం చేస్తానని మసూద్ అజహర్ హెచ్చరించాడు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక వేస్తానని తెలిపాడు మసూద్. ఈ మేరకు ఓ లేఖను రిలీజ్ చేశాడు. ఇక బహావల్ పూర్ లో మసూద్ అజహర్ కుటుంబంపై జరిపిన దాడిలో ఆయన అక్క, బావ, కోడలు, మసూద్ భార్య, ఐదుగురు పిల్లలు, మరో నలుగురు అనుచరులు హతం అయ్యారు.

56 ఏళ్ల మసూద్ అజహర్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పేర్కొంది. గతంలో జరిగిన పలు ఉగ్రదాడుల్లో ఆయన హస్తం ఉంది. 2001 పార్లమెంట్ అటాక్, 2008 ముంబై దాడులు, 2016 పథాన్ కోట్ దాడి, 2019 పుల్వామా దాడి.. తదితర దాడుల్లో ఆయన హస్తం ఉంది.

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా 9 ఉగ్రస్థావరాలపై భారత్ 24 మిస్సైల్స్ తో దాడికి పాల్పడింది. నిఘా వర్గాల అంచనా ప్రకారం 80 మంది ఉగ్రవాదులు హతం కాగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ దాడులతో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+