కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం.. రంగంలోకి 17 ఫైర్ ఇంజిన్లు !

కోల్‌కతాలో ఈరోజు ( నవంబర్ 15, 2025 ) తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అనూహ్య ఘటనతో నగరం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. స్థానిక ఎజ్రా స్ట్రీట్ ప్రాంతంలో అకస్మాత్తుగా భారీ మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాంతో వెంటనే ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

కాగా అగ్ని ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే సమీపంలోని ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, నివాస భవనాలకు మంటలు అంటుకున్నాయి. దీనికి తోడు దట్టమైన పొగతో ప్రాంతం అంతా కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం స్థానికులు కృషి చేశారు.

massive-fire-accident-at-kolkata-and-17-fire-engines-deployed

17 ఫైర్ ఇంజిన్లతో..

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం 17 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎత్తైన భవనాలకు వ్యాపిస్తున్నందున.. ప్రత్యేకంగా ఎక్కువ ఎత్తుకు చేరుకునే హైడ్రాలిక్ లాడర్లు సైతం వినియోగిస్తున్నారు.

అయితే అగ్ని ప్రమాదం భారీగా సంభవించడంతో దట్టమైన పొగ కొద్ది కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో రక్షణ సిబ్బందికి భవనాల్లోకి ప్రవేశించడం కష్టమవుతోంది. మంటల వల్ల కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. పాత భవనాలు, చిన్న వ్యాపార దుకాణాలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

ఇక అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాణనష్టం వివరాలు వెల్లడికాలేదు. అయితే పలువురు వ్యాపార సంస్థల గోదాములు దగ్ధమయ్యే ప్రమాదం ఉండటంతో ఆస్తినష్టం భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంటలు ఆర్పిన తర్వాతనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో ఎజ్రా స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పూర్తి స్థాయిలో మళ్లించారు. ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, అనుమతి లేని వ్యక్తిని లోపలికి అనుమతించడం లేదు. మంటలు అదుపులోకి వచ్చేవరకు ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+