జీవితంలో ఒక్క‌సారైనా చూడాల్సిన ప్ర‌దేశం ఇదే.. 21 కి.మీ టాయ్ ట్రైన్ జ‌ర్నీ అద్భుతం..

భారత్ లో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు.. చారిత్రక కట్టడాలు ఉన్నాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ మనకు తెలియని స్థానికంగా గుర్తింపు పొందిన పర్యాటక ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా అవి బాగా పాపులర్ అవుతున్నాయి. దాంతో ఆ ప్రాంతాలను చుట్టేయాలని ప్రకృతి ప్రేమికులు, ట్రావెలర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక భారత్ లో చాలా హిల్ స్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఏపీ ప్రాంతాల్లోని హిల్ స్టేషన్స్ గురించే అందరూ మాట్లాడుకుంటారు. కానీ మహారాష్ట్రలో ఓ అద్భుతమైన హిల్ స్టేషన్ ఉందన్న సంగతి మీకు తెలుసా..? అదే మాథేరాన్ హిల్ స్టేషన్. మ‌హారాష్ట్ర‌లోని రాయ్‌ గఢ్ జిల్లాలో విస్తరించిన ప‌శ్చిమ క‌నుమ‌ల మ‌ధ్య దాగి ఉంది ఈ అందమైన హిల్ స్టేషన్.

అయితే ఇది సాధారణ హిల్ స్టేషన్ కాదు.. ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్ సముద్ర మట్టానికి సుమారు 800 మీట‌ర్ల ఎత్తులో అంటే 2,625 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంతేకాక ఆసియా ఖండంలోనే ఏకైన వాహన రహిత హిల్ స్టేషన్ ఇదే కావడం విశేషం. ఇక అంతకుమించిన మరో అద్భుతం ఏంటి..? అంటే నేరల్- మాథెరాన్ మధ్య సాగే టాయ్ ట్రైన్ జర్నీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఏటా ఈ ట్రైన్ జర్నీని జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్యటకుల భద్రత దృష్ట్యా మూసేస్తారు. నవంబర్ నుంచి తిరిగి ప్రారంభిస్తారు.

అయితే అక్టోబర్ 30 నుంచి ఈ టాయ్ ట్రైన్ జర్నీ ప్రారంభం కానుంది. ఈ మేరకు సెంట్రల్ రైల్వే ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి డైరెక్షన్ లో రోజుకు రెండు రైళ్లను అందుబాటులో ఉంచింది. ఇక వీకెండ్ లో అదనంగా మరో రెండు ఎక్స్ ట్రా ట్రిప్ లను జత చేసింది. తొలి ట్రైన్ నేరల్ నుంచి అక్టోబర్ 30 ఉదయం 8 గంటల 50 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మాథెరాన్ కు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది. రెండో ట్రైన్ ఉదయం 10 గంటల 25 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. మాథెరాన్ కు మధ్యాహ్నం ఒంటి గంటా 5 నిమిషాలకు చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో భాగంగా మాథెరాన్ నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు రైలు స్టార్ట్ అవుతుంది. అలాగే రెండో రైలు సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. పచ్చని కొండలు, ప్రకృతి రమణీయత మధ్య ఏటా ఈ టాయ్ ట్రైన్ జర్నీని ఆస్వాదించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక ఇక మాథేరాన్ టాయ్ ట్రైన్ టికెట్ ధ‌ర‌లు చూస్తే.. ఫ‌స్ట్ క్లాస్ కోచ్ జ‌ర్నీ అయితే పెద్ద‌ల‌కు రూ. 300, పిల్ల‌ల‌కు రూ.180 ఉంటుంది. ఇక సెకండ్ క్లాస్ అయితే పెద్ద‌ల‌కు రూ.75, పిల్ల‌ల‌కు రూ.45 గా టికెట్ ధర ఉంది.

Matheran Hill Station is a place one must visit at least once in a lifetime 21 km toy train journey

ముంబై, పుణే వంటి ర‌ద్దీ నగరాల నుంచి దూరంగా వీకెండ్‌ ను ప్ర‌శాంతంగా గ‌డ‌పాల‌ని కోరుకునే ప‌ర్యాట‌కుల‌కు ఈ మాథెరాన్ హిల్ స్టేషన్ స్వ‌ర్గ‌ధామం అని చెప్పొచ్చు. ఇక ఇక్కడి దట్టమైన అడవులు, చిన్న చిన్న జ‌ల‌పాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అంతేకాక ఇది పూర్తిగా వెహిక‌ల్ ఫ్రీ ప్ర‌దేశం. పర్యాటకులు తమ సొంత వాహనాల్లో లేదా ట్యాక్సీల్లో దస్తూరి నాకా ప్రాంతం వరకు మాత్రమే అనుమతిస్తారు. దస్తూరి నాకా వద్ద వాహనాలు పార్క్ చేయాలి. ఇక అక్కడి నుంచి ఊళ్లోకి కాలిమార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. నడవలేని వారికి గుర్రాలు, చేత్తో లాగే రిక్షాలు అందుబాటులో ఉంటాయి. ఇక ఇక్కడి దట్టమైన అడవి, చెట్ల కారణంగా మిట్టమధ్యాహ్నమే చిమ్మ చీకట్లు పడినట్లు ఉంటుంది. ఇవే కాక ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి ఈ మాథెరాన్ హిల్ స్టేషన్ లో.. ఇంకెందుకు ఆల‌స్యం ఈ న‌వంబ‌ర్‌ లో మీ ఫ్రెండ్స్‌తో క‌లిసి మాథేరాన్ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+