MBBS: ‘బీమ్స్’ మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద నుంచి దూకి స్టూడెంట్ ఆత్మహత్య, ఏం జరిగిందంటే ?
ఆ యువకుడు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లో టాపర్స్ లిస్టులో ఉన్నాడు. తరువాత పరిస్థితులు రివర్స్ అయ్యాయి. ఎంబీబీఎస్ విద్యార్థి కాలేజ్ హాస్టల్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
బెంగళూరు/బీదర్: ప్రముఖ యూనివర్సిటీలోని మెడికల్ కాలేజ్ లో ఓ యువకుడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆ యువకుడు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ లో టాపర్. తమ కుమారుడు డాక్టర్ అయ్యి మాకు చేదోడువాదోడుగా ఉంటాడని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కాలేజ్ లో చదువుతున్న యువకుడు ప్రతిరోజు అతని కుటుంబ సభ్యులతో కొంతకాలం క్రితం వరకు మాట్లాడేవాడు. తరువాత పరిస్థితులు రివర్స్ అయ్యాయి. అయితే ఎంబీబీఎస్ విద్యార్థి కాలేజ్ హాస్టల్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆత్మహత్య విషయంలో కుటుంబ సభ్యులు ఒకరకంగా, కాలేజ్ లో లెక్చరర్స్ మరో రకంగా సమాచారం ఇస్తున్నారని పోలీసులు అంటున్నారు.

మెడికల్ కాలేజ్ స్టూడెంట్
కర్ణాటకలోని బీదర్ లోని బ్రిమ్స్ మెడికల్ కాలేజ్ లో శ్రీరామ్ (22) అనే యువకుడు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. శ్రీరామ్ సొంత ఊరు బీదర్ జిల్లాలోని చిట్టగుప్పా తాలుకాలోని ఓ గ్రామం (తెలంగాణ సరిహద్దు). స్నేహితులతో కలిసి బీదర్ లోని బీమ్స్ కాలేజ్ హాస్టల్ లో ఉంటున్న శ్రీరామ్ ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు.

కాలేజ్ హాస్టల్ మీద నుంచి దూకి ?
కాలేజ్ కు వెళ్లే ముందు, కాలేజ్ తరువాత హాస్టల్ కు వెళ్లిన తరువాత శ్రీరామ్ అతని ఇంటికి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడేవాడు. అయితే మంగళవారం కాలేజ్ కు వెళ్లిన తరువాత శ్రీరామ్ అతని స్నేహితులతో కూడా సరిగా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడని తెలిసింది. కాలేజ్ నుంచి హాస్టల్ కు వెళ్లిన శ్రీరామ్ అదే హాస్టల్ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

అసలు మ్యాటర్ తెలీదు
ఎంబీబీఎస్ టాపర్ శ్రీరామ్ బీమ్స్ కాలేజ్ హాస్టల్ లోని భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కాలేజ్ లో చదువుతున్న సాటి స్నేహితులు హడలిపోయారు. శ్రీరామ్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. ఇటీవల శ్రీరామ్ తండ్రి చనిపోయాడని, ఆ విషయంలో మానసికంగా శ్రీరామ్ కుంగిపోయాడని కొందరు చెబుతున్నారు. చివరి సంవత్సరం ప్రాక్టికల్స్ విషయంలో శ్రీరామ్ ఆందోళన చెందేవాడని, అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మెడికల్ కాలేజ్ లోని కొందరు లెక్చరర్స్ అంటున్నారని పోలీసులు అన్నారు. అయితే కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications