బంగారం ధరలు భారీగా డౌన్ ఫాల్
దేశీయ మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. భారీగా పడిపోయాయి. ఈ ఉదయం ట్రేడింగ్ లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,800 డాలర్లకు స్థిరపడింది. ముగింపు సెషన్ తో పోల్చుకుంటే 0.5 శాతం మేర తగ్గింది. అదేవిధంగా స్పాట్ సిల్వర్ కూడా ఒక శాతం క్షీణించింది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వెండి ధరలు కనీసం 15 శాతం పడిపోయాయి. మార్కెట్‌లో ఆందోళన ట్రెండ్‌ను అనుసరించి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో గోల్డ్ ధర తగ్గి రూ. 1.53 లక్షల మార్కు వద్ద నిలిచింది.
MCX బంగారం ధరలు ఈ ఉదయం 10 గ్రాములకు రూ. 1,53,850 వద్ద ట్రేడయ్యాయి. ట్రేడింగ్ సమయంలో రూ. 1,53,725 కనిష్ట స్థాయిని తాకింది కూడా. వెండిది కూడా అదే పరిస్థితి. ఇది బంగారం కంటే బలహీనంగా ఉంది. ఇది దాదాపు ఒక శాతం తగ్గి రూ. 2.51 లక్షల వద్ద ఊగిసలాడుతోంది. వెండి ధరలో 1,545 తగ్గుదల కనిపించింది. రూ. 2.51 లక్షల వద్ద కొనసాగుతోంది. వెండి ప్రారంభంలో కిలోకు రూ. 2,50,210 కనిష్ట స్థాయి, రూ. 2,51,222 గరిష్ట స్థాయిని నమోదు చేసింది.

మరోవైపు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి పాకిస్తాన్‌లో US ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇరాన్ రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగిసేలోపు USతో రెండో విడత చర్చల కోసం ఇస్లామాబాద్‌కు ప్రతినిధి బృందాన్ని పంపనుంది. గడువులోపు ఒప్పందం కుదరకపోతే ప్రస్తుత కాల్పుల విరమణను పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,600, 22 క్యారెట్లు - రూ. 14,300, 18 క్యారెట్లు - రూ. 11,855
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,529, 22 క్యారెట్లు- రూ. 14,235, 18 క్యారెట్లు - రూ. 11,647
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,529, 22 క్యారెట్లు- రూ. 14,235, 18 క్యారెట్లు - రూ. 11,647
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,529, 22 క్యారెట్లు- రూ. 14,235, 18 క్యారెట్లు - రూ. 11,647
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,529, 22 క్యారెట్లు- రూ. 14,235, 18 క్యారెట్లు - రూ. 11,647
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,529, 22 క్యారెట్లు- రూ. 14,235, 18 క్యారెట్లు - రూ. 11,647

Click it and Unblock the Notifications