Drone: 30 నిమిషాల్లో 40 కి.మీ దూరానికి ఔషధాలు తీసుకెళ్లిన డ్రోన్..
ఉత్తరాఖండ్ లో డ్రోన్ ద్వారా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి ఔషధాలు తరలించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా చిన్న ఆసుపత్రులకు డ్రోన్లు ద్వారా ఔషధాలు పంపడానికి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-రిషికేశ్ గురువారం ట్రయల్ నిర్వహించింది. టెహ్రీ గర్వాల్‌లోని జిల్లా ఆసుపత్రికి 2 కిలోల యాంటీ ట్యూబర్‌క్యులర్ మందుల ప్యాకేజీని డెలివరీ చేయడానికి వెర్టిప్లేన్ X3 డ్రోన్ ఉపయోగించారు.

కఫం నమూనాలు
ఎయిమ్స్‌లోని హెలిప్యాడ్ నుంచి ఆసుపత్రికి మధ్య దాదాపు 40 కిలోమీటర్ల దూరాన్ని డ్రోన్ 30 నిమిషాల్లో ప్రయాణించింది. ఈ ప్రాజెక్ట్ 2025 నాటికి టిబిని నిర్మూలించే దేశ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి మందులను మాత్రమే కాకుండా కఫం నమూనాలను ప్రయోగశాలలకు తీసుకెళ్లడానికి కూడా ఉపయోగించనున్నారు.

50 కిలోమీటర్ల దూరం
"డ్రోన్ల ద్వారా ఔషధాలను పంపిణీ చేసే ప్రయోగం ఈరోజు విజయవంతమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. డ్రోన్‌లతో మందులు డెలివరీ చేయడం ముఖ్యంగా కొండ ప్రాంతాలలో 40 కిలోమీటర్ల దూరం 2 గంటలు పట్టవచ్చన్నారు. ఎయిమ్స్-ఢిల్లీ, ఝజ్జర్‌లో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేషనల్ క్యాన్సర్ సెంటర్ మధ్య సామాగ్రిని రవాణా చేయడానికి కూడా ఇదే విధమైన ట్రయల్ నిర్వహిస్తామని మాండవియా తెలిపారు.

4 కిలోల బరువు
"బలహీనమైన రవాణా నెట్‌వర్క్‌లు, కొండ ప్రాంతాలు, ట్రాఫిక్ ప్రకృతి వైపరీత్యాలు ప్రభావిత ప్రాంతాలు, కఠినమైన వాతావరణ పరిస్థితులు వంటి అనేక అడ్డంకులు ఎదుర్కొని డ్రోన్ల ద్వారా ఔషధాలు రవాణా చేయవచ్చని తెలిపారు.
గురువారం రిషికేశ్‌లో ఉపయోగించిన డ్రోన్, 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో 4 కిలోల బరువును మోసుకెళ్లేళ్లింది. ఈ డ్రోన్ ను టెక్ ఈగల్ ఇన్నోవేషన్స్‌చే తయారు చేసింది.

కోవిడ్ -19 వ్యాక్సిన్
వైద్య సామాగ్రిని రవాణా చేయడానికి డ్రోన్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. వాస్తవానికి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేతృత్వంలోని పైలట్ ప్రాజెక్ట్‌లో, మణిపూర్‌లో డ్రోన్‌ను ఉపయోగించి కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను రవాణా చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని బెంగళూరుకు చెందిన స్టార్టప్ మందులను డెలివరీ చేయడానికి మరో పైలట్‌ను నిర్వహించింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications