ఆ గ్రామాల్లో నగ్నంగా పురుషులు.. మహిళల్ని పొదల్లోకి లాక్కెల్లి..

సాధారణంగా మనం ఛడ్డీ గ్యాంగ్స్ గురించి విన్నాం. కానీ ఇప్పుడు నగరాలు, గ్రామాల్లో న్యూడ్ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. గ్రామాల్లో పురుషులు నగ్నంగా తిరుగుతున్నారు. ఒంటరి మహిళలు కనబడితే వాళ్లని పొదల్లోకి లాక్కెళ్తున్నారు. అలా బట్టలు లేకుండా గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. రాను రాను ఈ ఘటనలు మరిన్ని గ్రామాలకు విస్తరించిన నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆ గ్రామాల్లో డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు.

దొంగలు, మానవ మృగాలు రకరకాల ముసుగులో తిరుగుతున్నారు. మనం చడ్డీ గ్యాంగ్ గురించిన విన్నాం. అయితే ఇప్పుడు కొత్తగా న్యూడ్ గ్యాంగ్ తయారైంది. ఈ గ్యాంగ్ ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ ప్రాంత ప్రజల్ని నిద్ర పోనివ్వడం లేదు. ముఖ్యంగా మహిళలే టార్గెట్ గా ఈ న్యూడ్ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. గ్రామాల్లోకి చొరబడి.. మహిళ కనిపిస్తే చాలు.. వారిని చెట్ల పొదలు, ఎవరూ లేని ప్రాంతాలకు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేస్తున్నారు. ఈ న్యూడ్ గ్యాంగ్ ఇప్పుడు మీరట్‌ పరిసరాల్లోని గ్రామాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అక్కడి ప్రజలు ముఖ్యంగా మహిళలు రాత్రిళ్లు బయటకు వెళ్లాలంటేనే భయాందోళన చెందుతున్నారు.

భారాలా అనే గ్రామంలో ఓ మహిళను నగ్నంగా ఉన్న పురుషులు వెంబడించారు. ఎవరూ లేని ప్రాంతంలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించారని భారాలా గ్రామస్థులు తెలిపారు. మరోసారి నగ్నంగా ఉన్న పురుషులను చూసి ఓ మహిళ అరుపులు, కేకలు వేయడంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. ఇతర గ్రామంలోనూ మరో ముగ్గురు మహిళలకు ఇలాంటి సంఘటనే ఎదురైందని వాపోయారు. ఈ క్రమంలో ఈ వరుస ఘటనలపై పోలీసులు దృష్టి సారించారు.

Meerut Gripped by Fear Nude Gang Targets Women in Surrounding Areas

టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ల సాయంతో న్యూడ్ గ్యాంగ్ ను పట్టుకుంటున్నారు పోలీసులు. న్యూడ్ గ్యాంగ్ కోసం గాలింపు చేపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అనుమానితులుగా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఆయా గ్రామాల్లో పోలీసులను మోహరించినట్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+