Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బస్తర్ అడవుల్లో... 'మహిళా డైనమైట్'!

బస్తర్ అడవుల్లో విధి నిర్వహణ నిజంగా కత్తి మీద సామే. కానీ అలాంటి చోట.. పనిచేయడానికి తొలిసారిగా సీఆర్పీఎఫ్ లో ఉషా కిరణ్ అనే మహిళా అధికారి ముందుకొచ్చారు.

రాయ్ పూర్: బస్తర్ అడవులు.. ఈ పేరు చెబితేనే తుపాకుల మోతలు, మందుపాతరల పేలుళ్లు, ఆదివాసీల తిరుగుబాట్లు.. ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఇదొక గిరిజన ప్రాంతం.

ఇక్కడ పని చేయడం భద్రతా దళాలకు కత్తిమీద సాములాంటిది. మావోయిస్టు దాడులతోపాటు దోమకాటు కారణంగా మలేరియా వచ్చి కూడా సీఆర్పీఎఫ్ తదితర బలగాల్లోని సిబ్బంది మరణిస్తూ ఉంటారు.

అలాంటి చోట.. పనిచేయడానికి మొట్టమొదటిసారిగా సీఆర్పీఎఫ్ లో ఇప్పుడొక మహిళా అధికారి ముందుకొచ్చారు. ఆమె పేరు ఉషా కిరణ్ (27). గిరిజన ప్రాంతాల్లో పనిచేసే సీఆర్పీఎఫ్ బలగాలు, సైన్యం అక్కడి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు అధికంగా వినిపిస్తున్న నేపథ్యంలో కీలకమైన పీఆర్ బాధ్యతల్లో ఈమె నియమితులయ్యారు.

2015 అక్టోబర్ నెలలో నిర్వహించిన ఓ ఆపరేషన్ సందర్భంగా 16 మంది గిరిజన మహిళలపై భద్రతా దళాలు అత్యాచారం జరిపాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఒకవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ ఆర్ సి) తేల్చి చెప్పిన రెండ్రోజులకే ఉషా కిరణ్ నియామకం జరగడం విశేషం.

 Meet Usha Kiran, Bastar’s first woman CRPF officer in the Maoist hotbed

సీఆర్పీఎఫ్ కు చెందిన 80వ బెటాలియన్లో ఆమె అసిస్టెంట్ కమాండెంట్ గా పని చేస్తున్నారు. ఉషా కిరణ్ రాక ముందు అసలు భద్రతాదళాలు అంటేనే గిరిజన మహిళలు వణికిపోయేవారు.

అయితే ఉషా కిరణ్ వచ్చిన తరువాత పరిస్థితి బాగా మారిందని బస్తర్ ప్రాంత సీఆర్పీఎఫ్ డీఐజీ సంజయ్ యాదవ్ చెప్పారు. గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించడం ఇప్పుడు భద్రతాదళాలకు సులువుగా ఉందన్నారు.

ట్రిపుల్ జంప్ విభాగంలో జాతీయస్థాయి క్రీడాకారిణి అయిన ఉషా కిరణ్.. సీఆర్పీఎఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరు. మరో మహిళ అర్చనా గౌరా కొండగావ్ వద్ద పని చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం మావోయిస్టుల ప్రభావం పెద్దగా ఉండదు.

ఉషా కిరణ్ తాత, తండ్రి కూడా సీఆర్పీఎఫ్ లో పనిచేసిన వారే. దీంతో ఆమె కూడా సీఆర్పీఎఫ్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపారు. ఉషా కిరణ్ రాకతో బస్తర్ ప్రాంతంలో తమ పని చాలా సులువైందని దర్భా పోలీసు స్టేషన్ ఇన్ చార్జ్ వివేక్ ఉయికె కూడా పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+