లిఫ్ట్‌లో గర్ల్‌ని ముద్దు అడిగిన కంపెనీ సీఈవో, బలవంతం

కోరమంగల సమీపంలోని జక్కసంద్రంలో ఓ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ సీఈవో తన పైన ఆకృత్యానికి పాల్పడినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అదే కంపెనీలో ఈమె మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్నారు.
గత నెల 30వ తేదీన ఇద్దరు కలిసి హెచ్ఎస్ఆర్ లే అవుట్‌లోని ఓ హెటల్‌లో భోజనం కోసం వెళ్లారు. అక్కడ సదరు సీఈవో మద్యం తాగారు. భోజనం ముగించిన అనంతరం లిఫ్టులో ఇద్దరు కిందకు వచ్చే సమయంలో ముద్దు ఇవ్వాలని ఆమెను అతను ఒత్తిడి తెచ్చాడు. అంతేకాదు, బలవంతంగా ముద్దు పెట్టుకోవడంతో పాటు లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపారు.












Click it and Unblock the Notifications