లవర్‌ని చూడగానే అబ్బాయిలకే కలిగే మొదటి ఫీలింగ్‌ అదేనట.. !

ఇష్టమైన వ్యక్తులతో సహవాసం ఆనందానికి దారితీస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఒక అధ్యయనం మరింత ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. అదేంటంటే, పురుషులు ఎంత ఒత్తిడిలో, ఎంత టెన్షన్‌లో ఉన్నా సరే, ఒక్కసారి తమ గర్ల్‌ఫ్రెండ్‌ను చూస్తే చాలు, ఆ ఒత్తిడి, టెన్షన్ క్షణాల్లో మాయమైపోతాయని, వారు ఒత్తిడి రహితంగా ఫీల్ అవుతారని ఈ అధ్యయనం పేర్కొంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

అధ్యయనం ప్రకారం, 72% మంది పురుషులు తమ స్నేహితురాలిని లేదా ప్రియురాలిని చూసిన తర్వాత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందినట్లు తేలింది. మనస్తత్వవేత్తలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.

సాధారణంగా, ఒకే లింగానికి చెందిన వ్యక్తుల కంటే వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ, సాన్నిహిత్యం, మరియు భావోద్వేగ అనుబంధాలు చాలా బలంగా ఉంటాయి. స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఒక సహజ లక్షణమని సైన్స్ కూడా నిర్ధారిస్తుంది. అయితే, పురుషులు తమ ప్రియురాలిని చూసినప్పుడు ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందడం వెనుక శాస్త్రీయ కారణం ఉందని మనస్తత్వ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

Men feel less stressed when they see their girlfriend

శాస్త్రీయ వివరణ:
ప్రియమైన వ్యక్తి కళ్లముందు ఉన్నప్పుడు, ఆ వ్యక్తిని చూడటం వల్ల మెదడులో డోపమైన్ , సెరటోనిన్ వంటి ఆనందాన్ని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. ఈ రసాయనాలు ఒత్తిడి, టెన్షన్, ఆందోళనలను తగ్గించి, మానసిక ప్రశాంతత సౌకర్యం , సురక్షిత భావాన్ని అందిస్తాయి. పురుషులు తమ ప్రియురాలిని చూసినప్పుడు ఈ ప్రక్రియ మరింత వేగంగా, అధికంగా జరుగుతుంది. అందుకే వారు ఎంత ఒత్తిడిలో ఉన్నప్పటికీ, గర్ల్‌ఫ్రెండ్‌ను చూడగానే ఒత్తిడి రహితంగా భావిస్తారు. పరోక్షంగా, ఇది అధిక రక్తపోటును నియంత్రించడం, రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా మొత్తం మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+