నా ఇల్లు ఇండియా..: అధికారిక బంగ్లా తిరిగి కేటాయింపుపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో గతంలో ఆయన ఖాళీ చేసిన అధికారిక నివాసాన్ని తిరిగి ఆయనకే కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ హౌసింగ్ కమిటీ.. ఢిల్లీలోని 12-తుగ్లక్ లేన్‌లోని అధికారిక బంగ్లాను తిరిగి రాహుల్‌కు కేటాయించిందని తెలిపాయి.
గతంలో తాను నివాసం ఉన్న ఇంటిని లోక్ సభ హౌసింగ్ కమిటీ తిరిగి కేటాయించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తనకు కేవలం అదొక్కటే కాదని, భారత్ మొత్తం తన ఇల్లేనని వ్యాఖ్యానించారు.

కాగా, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ఏప్రిల్ నెలలో రాహుల్ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి.. 10 జన్‌పథ్‌లోని తన తల్లి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసానికి వెళ్లి అక్కడే ఉంటున్నారు.

తాజాగా, రాహుల్‌పై అనర్హత వేటును సుప్రీంకోర్టు తొలగించిన నేపథ్యంలో తిరిగి అదే బంగ్లాను ఆయనకు కేటాయించినట్లు తెలుస్తోంది. 2005 నుంచి ఏప్రిల్‌లో ఖాళీ చేసేంతవరకు రాహుల్ అదే బంగ్లాలో నివాసమున్నారు. ప్రస్తుతం హౌసింగ్ కమిటీ తిరిగి అధికారిక బంగ్లా కేటాయించడంతో.. ఆయన అందులోకి మారతారా? లేదంటే తల్లి సోనియాతోపాటే 10 జన్‌పథ్‌లోనే ఉంటారా? అనేదానిపై స్పష్టత లేదు.
#WATCH | "Mera ghar poora Hindustan hai," says Congress MP Rahul Gandhi when asked for a reaction on media reports about getting back his official residence as an MP
— ANI (@ANI) August 8, 2023
He has arrived at the AICC Headquarters for a meeting with the leaders of Assam Congress. pic.twitter.com/KtIzZoRPmm
కాగా, అనర్హత వేటు ఎత్తివేయడంతో రాహుల్ గాంధీ మంగళవారం పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. రాహుల్.. తిరిగి లోక్‌సభలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications