బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Midnight: అర్దరాత్రి మీకు కొంపలో పనిపాటా లేదా ?, దంపతులను పోలీసులు ఏం చేశారంటే ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు సిటీలో కొందరు పోలీసుల చేతివాటం ఎలా ఉంటుందో మరోసారి వెలుగు చూసింది. అర్దరాత్రి స్నేహితుల ఇంటిలో జరుగుతున్న పార్టీకి దంపతులు హాజరైనారు. అర్దరాత్రి వరకు స్నేహితులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు. అర్దరాత్రి దంపతులు సమీపంలోని ఇంటికి నడుచుకుంటూ వెలుతున్నారు. గస్తీ తిరుగుతున్న పోలీసులు దంపతులను అడ్డగించారు. దంపతులు నాన్ లోకల్ అని తెలుసుకున్న పోలీసులు సవాలక్ష ప్రశ్నలు వేశారు. అడిగినంత డబ్బులు ఇస్తారా, లేదంటే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లమంటారా అంటూ రెచ్చిపోయారు. దంపతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన గస్తీ పోలీసులు అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. తరువాత భర్త దెబ్బకు పోలీసులకు సినిమా కనపడింది.

Lady techie: భార్యను ఫ్రెండ్స్ కు దానం చేసిన భర్త, బెడ్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్, మరదలు!Lady techie: భార్యను ఫ్రెండ్స్ కు దానం చేసిన భర్త, బెడ్ రూమ్ వీడియోలతో బ్లాక్ మెయిల్, మరదలు!

 ఒకే ప్రాంతంలో స్నేహితులు

ఒకే ప్రాంతంలో స్నేహితులు

బెంగళూరు సిటీలోని హెబ్బాళ సమీపంలోని మాన్యతా టెక్ పార్క్ సమీపంలో కార్తీక్ పాత్రి అలియాస్ కార్తీక్ అనే వ్యక్తి అతని భార్యతో కలసి నివాసం ఉంటున్నారు. మాన్యతా టెక్ పార్క్ సమీపంలోనే కార్తీక్ స్నేహితులు కొందరు నివాసం ఉంటున్నారు. కార్తీక్ అతని స్నేహితులు ఎవరి ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినా, ఫంక్షన్లు జరిగినా అందరూ హాజరౌతుంటారు.

 కొంపలో పనిపాటా లేదా ?

కొంపలో పనిపాటా లేదా ?

గస్తీ తిరుగుతున్న సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానీస్టేబుల్ రాజేష్, కానీస్టేబుల్ నాగేష్ హోస్సళ కారులో అటు వైపు వెలుతూ కార్తీక్ దంపతులను అడ్డగించారు. కార్తీక్ దంపతులు నాన్ లోకల్ అని తెలుసుకున్న పోలీసులు వారికి సవాలక్ష ప్రశ్నలు వేశారు. అర్దరాత్రి మీకు ఇంట్లో ఏం పనిపాటా లేదా, రోడ్ల మీద తిరుగుతున్నారు, అసలు మీరు మొగుడు పెళ్లామేనా ? అంటూ రెచ్చిపోయారు.

 కొంపలో పనిపాటా లేదా ?

కొంపలో పనిపాటా లేదా ?

గస్తీ తిరుగుతున్న సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానీస్టేబుల్ రాజేష్, కానీస్టేబుల్ నాగేష్ హోస్సళ కారులో అటు వైపు వెలుతూ కార్తీక్ దంపతులను అడ్డగించారు. కార్తీక్ దంపతులు నాన్ లోకల్ అని తెలుసుకున్న పోలీసులు వారికి సవాలక్ష ప్రశ్నలు వేశారు. అర్దరాత్రి మీకు ఇంట్లో ఏం పనిపాటా లేదా, రోడ్ల మీద తిరుగుతున్నారు, అసలు మీరు మొగుడు పెళ్లామేనా ? అంటూ రెచ్చిపోయారు.

 ఆధార్ కార్డులు చూపించినా ?

ఆధార్ కార్డులు చూపించినా ?

మేము దంపతులు, సమీపంలో స్నేహితుడి ఇంటిలో బర్త్ డే పార్టీకి హాజరైనాము, భోజనం చేసుకుని ఇంటికి వెలుతున్నామని వారి చేతిలో ఉన్న బాక్స్ లోకి కేక్ కూడా పోలీసులు రాజేష్, నాగేష్ కు చూపించారు. అర్దరాత్రి మీరు రోడ్ల మీద న్యూసెన్స్ చేస్తున్నారని, మూడు వేల రూపాయలు ఇస్తే వదిలేస్తామని, లేదంటే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెలుతామని బెదిరించి కార్తీక్ మొబైల్ ఫోన్ లాక్కొని రెచ్చిపోయారు.

 గూగుల్ పేతో లంచం వసూలు

గూగుల్ పేతో లంచం వసూలు

చివరికి రూ. 1 వెయ్యి లంచం ఇవ్వడానికి కార్తీక్ అంగీకరించాడు. అయితే తన దగ్గర డబ్బు లేదని కార్తీక్ చెప్పడంతో గూగుల్ పే అయినా పర్వాలేదని పోలీసులు చెప్పారు. కార్తీక్ వెయ్యి రూపాయలు రాజేష్ కు గూగుల్ పే చేశాడు. లంచం వసూలు చేసిన గస్తీ పోలీసులు రాజేష్, కార్తీక్ అక్కడి నుంచి హోస్సళ కారులో వెళ్లిపోయారు. తరువాత కార్తీక్ తనకు జరిగిన అన్యాయం గురించి స్నేహితులు, బెంగళూరు పోలీసుల ట్విట్టర్ అకౌంట్ కు ట్యాగ్ చేసి వరుసగా ట్విట్లు చేశారు.

డిజిటల్ పేమెంట్ దెబ్బతో గూబ గుయ్ మనింది

డిజిటల్ పేమెంట్ దెబ్బతో గూబ గుయ్ మనింది

ఈ విషయం డీసీపీ అనూప్ శెట్టి వరకు వెళ్లింది. అర్దరాత్రి కార్తీక్ దంపతులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి నుంచి రూ. వెయ్యి రూపాయలు గూగుల్ పే ద్వారా లంచం తీసుకున్న హెడ్ కానీస్టేబుల్ రాజేష్, కానీస్టేబుల్ నాగేష్ ను సస్పెండ్ చేశామని, విచారణకు ఆదేశాలు జారీ చేశామని డీసీపీ అనూప్ శెట్టి తెలిపారు.

English summary
Midnight: Extorting money from couple, Two police personnel suspended near Hebbal in Bengaluru city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X