అమ్మాయిని నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి
బహ్రెయిచ్: తన స్నేహితులతో నది ఒడ్డున ఆడుకుంటున్న ఓ 13ఏళ్ల అమ్మాయిని.. ఓ మొసలి నీళ్లలోకి ఈడ్చుకువెళ్లిపోయింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతారాంపుర్వా గ్రామంలో చోటు చేసుకుంది.
కటార్నిఘాట్ వైల్డ్ లైఫ్ సాంక్షుయరీ అధికారి కథనం ప్రకారం.. పింకీ అనే అమ్మాయి తన మిత్రులతో కలిసి సరయు నది ఒడ్డున ఆడుకుంటోంది.

అదే సమయంలో ఆకస్మాత్తుగా నది నుంచి బయటికి వచ్చిన ఓ మొసలి ఆ బాలికను నదిలోకి ఈడ్చుకెళ్లింది. దీంతో మిగితావారు కేకలు వేయడం ప్రారంభించారు.
అక్కడి చేరుకున్న స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. కాగా, ఆమె కోసం గజ ఈతగాళ్లు నదిలో వెతుకుతున్నాని.. అయితే ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదని అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications