అత్యాచారయత్నానికి అత్యాచారం శిక్ష: అమ్మాయిపై రేప్

రాంచీకి 160 కిలోమీటర్ల దూరంలో గల బొకారో జిల్లాలోని గుల్గియా ధోరా గ్రామంలో ఆ సంఘటన జరిగింది. మైనర్ బాలికపై ఆమె సోదరుడి చేతిలో అత్యాచారానికి గురైన మహిళ భర్తతో పంచాయతీ అత్యాచారం చేయించింది.
మైనర్ బాలిక సోదరుడు మహిళ పట్ల ఆదివారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయంపై సోమవారంనాడు పంచాయతీకి ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక తల్లి సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం చేయాలని ఆదేశించిన పంచాయతీ సభ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. బాధితురాలి సోదరుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications