మిత్రుడి పనే: కాలేజీ గర్ల్‌పై హోటల్లో రేప్, హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

చండీఘర్: పక్షం రోజుల క్రితం అదృశ్యమైన 17 ఏళ్ల కాలేజీ అమ్మాయిపై అత్యాచారానికి, హత్యకు గురైంది. మిత్రుడే ఆ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. ఈ సంఘటన హర్యానాలోని గోహానాలో గల ఓ హోటల్లో జరిగింది.

మృతురాలిని సోనిపాట్‌లోని ఖాన్పూర్ కలాన్‌కు చెందిన విక్రమ్ సింగ్ అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. సంఘటన గురించి తెలుసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృదం (సిట్) అధికారులు హోటల్ యజమాని భార్య మెహక్‌ను మంగళవారంనాడు అరెస్టు చేశారు. తన భర్త ప్రోద్బలంతో మృతురాలికి దుస్తులు తొడగడానికి సహకరించినట్లు ఆమె అంగీకరించింది.

Missing college student 'raped & killed' by friend

హోటల్ వర్కర్స్ బిజేందర్ సింగ్, వికాస్ సింగ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాధే రాధే హోటల్‌లో జరిగిన ఈ సంఘటన జరిగింది. ఆ హోటల్ రిజిస్టర్‌లో ఎంట్రీ అయిన వివరాలు విక్రమ్ సింగ్ వివరాలతో సరిపోలినట్లు పోలీసులు తెలిపారు.

నవంబర్ 12వ తేదీ సాయంత్రం విక్రమ్ హోటల్ గది నుంచి వచ్చి బాధితురాలు స్పృహ తప్పి పడిపోయినట్లు హోటల్ యజమాని రాధే శ్యామ్‌కు చెప్పినట్లు సిట్ అధికారులు తెలిపారు. హోటల్ యజమానికి మృతురాలికి బట్టలు తొడగడానికి తన భార్య సహాయం తీసుకున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 17-year-old college girl from Haryana, who went missing over a fortnight back, was allegedly raped and murdered by her friend at a hotel in Gohana.
Please Wait while comments are loading...