ఈ యాప్ ద్వారా మీ ప్రాంతంలో పిడుగుపాటును ముందే తెలుసుకోవచ్చు!

వర్షాకాలంలో... వానలతోపాటు ఉరుములుమెరుపులతో పిడుగులు పడుతుంటాయి. చాలా సార్లు నిర్మానుష్య ప్రాంతాల్లో పడటంతో ఎలాంటి హాన జరగదు కానీ, కొన్ని కొన్ని సార్లు మనుషులు, జంతువులు ఉన్న ప్రదేశాల్లో పిడుగులు పడితే మాత్రం ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఇలా అనేక మంది మనుషులు, జంతువులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలం క్రితమే సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌తో మనం ఉండే ప్రదేశంలో పిడుగుపడుతుందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మొబైల్​ యాప్​‌ను మీ ఫోన్​లో ఇన్‌​స్టాల్ చేసుకోవడం ద్వారా పిడుగుపాటును ముందే తెలుసుకోవచ్చు. ఈ యాప్ మీ మొబైల్​లో​ ఉన్నట్లయితే అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు.

mobile app damini to track thunderbolts in your area

ఆ యాప్ వివరాల్లోకి వెళితే.. పిడుగుల గురించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ యాప్ పేరు.. 'Damini: Lightning Alert'. దీన్ని 2020లో.. కేంద్ర భూవిజ్ఞాన శాఖ కింద పనిచేసే 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ (ఐఐటీఎం)' రూపొందించింది. ఈ యాప్ ద్వారా మీరు ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో అరగంట ముందుగానే తెలుసుకోవచ్చు.

మొబైల్​లో మీ జీపీఎస్ లొకేషన్ ఆధారంగా 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించిన సమాచారాన్ని ఈ యాప్ ముందుగానే మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. అంతేగాక, ఈ యాప్ పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఏవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేస్తుంది.

ఈ యాప్ ఎలా యూజ్ చేయాలంటే ?

ముందుగా మీ మొబైల్​లో 'గూగుల్ ప్లే స్టోర్' లేదా 'యాపిల్ యాప్ స్టోర్' నుంచి 'Damini: Lightning Alert' అనే యాప్‌ను ఇన్‌​స్టాల్ చేసుకోవాలి.
ఆ తర్వాత అందులో మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్ కోడ్ వంటి వివరాలు అందించి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత.. మీ జీపీఎస్ లోకేషన్ తెలుసుకోవడం కోసం యాప్​‌కు పర్మిషన్ ఇవ్వాలి.
ఆ విధంగా మీరు వివరాలు అందించాక యాప్‌​లో మీరు ఉన్న ప్రాంత చుట్టూ 40 కిలోమీటర్ల పరిధిలో ఒక సర్కిల్ కనిపిస్తోంది.
అలాగే మీ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉందో లేదో తెలుసుకోవడానికి మూడు రంగులను ఐడెంటిఫికేషన్ కలర్స్​ కింద చూపిస్తుంది. వాటి ఆధారంగా ఈ యాప్ మీరు ఉన్న చోట పిడుగు పడే ఛాన్స్ ఉంటే ముందే హెచ్చరిస్తుంది.
రెడ్ కలర్ : మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది.
యెల్లో కలర్ : మీ ప్రాంతంలో మరో 10-15 నిమిషాల్లో పిడుగు పడే ఛాన్స్ ఉంటే యాప్​‌లోని సర్కిల్ పసుపు రంగులోకి మారుతుంది.
బ్లూ కలర్ : అలాగే.. మీరూ ఉన్న చోట మరో 18-25 నిమిషాల్లో పిడుగు పడే ఛాన్స్ ఉంటే ఆ సర్కిల్ బ్లూ కలర్​లోకి మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+