వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Model: నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు, వస్తే స్వర్గం చూపిస్తా, వస్తావా ?, ఎగరేసుకుంటూ వెళ్లిన వ్యాపారవేత్త!

|
Google Oneindia TeluguNews

కొచ్చి/కేరళ: వివాహం చేసుకున్న దంపతులు సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించి పాపులర్ అయ్యారు. ఇన్ స్టాగ్రామ్ లో దంపతులకు ఊహించని ఫాలోవర్స్ ఉన్నారు. దంపతులకు స్నేహితులు ఎక్కువ అయ్యారు. నిత్యం దంపతులు ఎక్కువగా బయట తిరుగుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఇన్ స్టాగ్రామ్ లో చరుకుగా ఉంటున్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో వ్యాపారవేత్తకు ఓ యువతి పరిచయం అయ్యింది. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఆ వ్యాపారవేత్త, యువతి గంటలు గంటలు చాటింగ్ చేసుకుంటున్నారు. కాలక్రమేనా ఇద్దరూ దగ్గర అయ్యారు.

నా భర్త దుబాయ్ లో ఉంటున్నాడని, అనారోగ్యంతో ఉన్న తన తల్లితో నేను ఇక్కడే ఉంటున్నానని వ్యాపారవేత్తకు చెప్పింది. నా భర్త దుబాయ్ రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాడని, భర్త దూరంగా ఉండటంతో నేను విరహంతో ఉన్నానని, మీరు మా ఇంటికి వస్తే మీకు స్వర్గం చూపిస్తానని, నాకు మీరు స్వర్గం చూపించాలని వ్యాపారవేత్తకు ఆమె చాలా కసిగా, కామంతో చెప్పింది. యువతి చెప్పిన అడ్రస్ కు వ్యాపారవేత్త వెళ్లాడు. ఇంట్లో యువతి మాత్రమే ఉంది. బెడ్ రూమ్ లో యువతితో వ్యాపారవేత్త రొమాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది.

Reverse: అన్న భార్య హత్యకు మరిది రూ. 25 లక్షలు డీల్, మరిది ప్లాన్ కు రివర్స్ డీల్ మాట్లాడిన వదిన, క్లైమాక్స్!Reverse: అన్న భార్య హత్యకు మరిది రూ. 25 లక్షలు డీల్, మరిది ప్లాన్ కు రివర్స్ డీల్ మాట్లాడిన వదిన, క్లైమాక్స్!

 కేరళలో చాలా ఫేమస్ దంపతులు

కేరళలో చాలా ఫేమస్ దంపతులు

కేరళలోని పాలక్కాడ్ సమీపంలోని యాకరై ప్రాంతంలో గోకుల్ దీప్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం దేవ్ అలియాస్ దేవి అనే యువతిని గోకుల్ దీప్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకుని హ్యాపీగా ఉంటున్న గోకుల్ దీప్, దేవ్ దంపతులు సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించి పాపులర్ అయ్యారు.

భార్య మోడల్...... లక్షల్లో ఫాలోవర్స్

భార్య మోడల్...... లక్షల్లో ఫాలోవర్స్

ఇన్ స్టాగ్రామ్ లో గోకుల్ దీప్, దేవ్ దంపతులకు ఊహించని ఫాలోవర్స్ ఉన్నారు. గోకుల్ భార్య దేవ్ ఇన్ స్టాగ్రామ్ మోడల్ గా చాలా ఫేమస్ కావడంతో ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్ ను సంపాధించుకున్న గోకుల్ దీప్, దేవ్ దంపతులు నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. గోకుల్ దీప్, దేవ్ దంపతులకు స్నేహితులు ఎక్కువ అయ్యారు. గోకుల్ దీప్, దేవ్ దంపతులు ఎక్కువగా బయట తిరుగుతున్నారు.

ప్రముఖ వ్యాపారవేత్తకు పరిచయం

ప్రముఖ వ్యాపారవేత్తకు పరిచయం

గోకుల్ దీప్ కు శరత్ అనే కన్నింగ్ ఫ్రెండ్ ఉన్నాడు. కొన్ని నెలల క్రితం కేరళలోని త్రిశూర్ సమీపంలోని కొడంగల్లూర్ లో నివాసం ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్తకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువతి పరిచయం అయ్యింది. వ్యాపారవేత్త, ఆ యువతి మొదట హాయ్ అంటూ పరిచయం చేసుకున్నారు. తరువాత వ్యాపారవేత్తతో ఆ యువతి టచ్ లో ఉంది.

నా మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు

నా మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు

ప్రతిరోజు సోషల్ మీడియాలో ఆ వ్యాపారవేత్త, ఆ యువతి గంటలు గంటలు చాటింగ్ చేసుకుంటున్నారు. కాలక్రమేనా వ్యాపారవేత్త, ఆ యువతి దగ్గర అయ్యారు. నాకు వివాహం అయ్యిందని, పిల్లలు లేరని, నా భర్త దుబాయ్ లో ఉంటున్నాడని, అనారోగ్యంతో ఉన్న తన తల్లితో నేను పాలక్కాడ్ సమీపంలో ఒంటరిగా ఉంటున్నానని ఆ యువతి వ్యాపారవేత్తకు చెప్పింది.

విరహంతో ఉంటున్నా, నువ్వు వచ్చి స్వర్గం చూపిస్తావా ?

విరహంతో ఉంటున్నా, నువ్వు వచ్చి స్వర్గం చూపిస్తావా ?

నా భర్త దుబాయ్ రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాడని, భర్త దూరంగా ఉండటంతో నేను విరహంతో ఉన్నానని, మీరు మా ఇంటికి వస్తే మీకు నేను స్వర్గం చూపిస్తానని, నాకు మీరు స్వర్గం చూపించాలని వ్యాపారవేత్తకు ఆమె చాలా కసిగా, కామంతో చెప్పింది. యువతి సెక్స్ జోకులు వేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటంతో ఆ వ్యాపారవేత్త టెమ్ట్ అయిపోయాడు.

బెడ్ రూమ్ లో సీన్ రివర్స్

బెడ్ రూమ్ లో సీన్ రివర్స్

ఎలాగైనా యువతితో ఎంజాయ్ చెయ్యాలని వ్యాపారవేత్త డిసైడ్ అయిపోయాడు. యువతి చెప్పిన పాలక్కాడ్ సమీపంలోని యాకరై ప్రాంతంలోని ఇంటికి వ్యాపారవేత్త వెళ్లాడు. తోటలో ఒకే ఇల్లు ఏంతో ప్రశాంతంగా ఉండటంతో వ్యాపారవేత్త ఆ పరిసర ప్రాంతాలు చూసి సంతోషించాడు. ఇంట్లోకి వెళ్లిన వ్యాపారవేత్త యువతి మాత్రమే ఒంటరిగా ఉండటం చూసి ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు. యువతి, వ్యాపారవేత్త బెడ్ రూమ్ లోకి వెళ్లి రొమాన్స్ చెయ్యడం మొదలు పెట్టిన సమయంలో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది.

డబ్బులు డిమాండ్

డబ్బులు డిమాండ్

ఐదు మంది వ్యక్తులు ఒకేసారి ఇంట్లోకి వెళ్లి ఆ వ్యాపారవేత్త బట్టలు మొత్తం ఇప్పించి అతన్నినగ్నంగా తయారు చేసి ఫోటోలు, వీడియోలు తీశారు. నీ నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డులు, నగదు, విలువైన పత్రాలు, కారుల లాక్కొన్నారు. రూ. 10 లక్షలు ఇవ్వకుంటా నీ నగ్నవీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని నిందితులు బెదిరించారు.

కారులో నుంచి దూకేసిన వ్యాపారవేత్త

కారులో నుంచి దూకేసిన వ్యాపారవేత్త

కొడంగల్ లోని తన అపార్ట్ మెంట్ లో డబ్బు ఉందని, మీరు అక్కడికి వస్తే డబ్బులు ఇస్తానని వ్యాపారవేత్త నమ్మించాడు. వ్యాపారవేత్తను పిలుచుకుని కారులో బయలుదేరారు. మార్గం మద్యలో కారులో నుంచి కిందకు దూకేసిన వ్యాపారవేత్త తప్పించుకుని వెళళ్లి పాలక్కాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న గోకుల్ దీప్, దేవ్ దంపతులతో పాటు కోట్టాయంలో నివాసం ఉంటు్ శరత్, త్రిశూర్ కు చెందిన అజిత్, వినయ్, జిష్ణు అనే ఆరు మందిని అరెస్టు చేశారు.

ఓరి నాయనో..... కిలాడీ దంపతుల స్కెచ్

ఓరి నాయనో..... కిలాడీ దంపతుల స్కెచ్

యూట్యూబ్ చానల్ యజమాని అయిన కిలాడీ లేడీ దేవ్ స్నేహితుడు శరత్ అమ్మాయిలాగా వ్యాపారవేత్తతో పరిచయం పెంచుకుని వ్యాపారవేత్తను హనీట్రాప్ లో దింపాడని పోలీసులు అన్నారు. యూట్యూబ్ చానల్ దంపతులు గోకుల్ దీప్ అతని భార్య దేవ్ ను వ్యాపారవేత్తతో రొమాన్స్ చెయ్యడానికి పంపించాడని వెలుగు చూసంది. కిలాడీ దంపతుల గ్యాంగ్ లోని వ్యక్తి శరత్ కింగ్ పిన్ కావడంతో నిందితులకు ఇప్పుడు అసలు కథ మొదలైయ్యింది.

English summary
Model: South police arrested a woman in the case of honey trapping a businessman in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X