ఓటు వేసిన ప్రధాని మోడీ

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రనిప్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గుజరాత్‌లో ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఓటు వేసిన అనంతరం కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినంత ఆనందం కలిగిందని మోడీ చెప్పారు. భారత ఓటర్లు విజ్ఞత కలవారని ప్రశంసించారు. మూడో దశ పోలింగ్‌కు ఓటర్లు భారీ సంఖ్యలో తరలిరావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును ఓటే నిర్ణయించబోతోందని చెప్పారు.

అంతకు ముందు గాంధీ‌నగర్‌లోని నివాసంలో ఉన్న తల్లిని మోడీ కలుసుకున్నారు. కాసేపు ఆమెతో ముచ్చటించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్‌కు బయలుదేరారు. పోలింగ్ స్టేషన్ వద్ద అమిత్ షా, ఆయన కుటుంబసభ్యులు మోడీకి స్వాగతం పలికారు. అమిత్ షా మనవరాలితో మోడీ కాసేపు కబుర్లు చెప్పారు.

Modi cast his vote at ahmedabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+