ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా

ఢిల్లీ : ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సమర్పించారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ప్రధాని కేబినెట్‌ను రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని ప్రెసిడెంట్‌కు అందజేశారు. మోడీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధానిగా కొనసాగాలని కోరారు. మోడీ రాజీనామా ఆమోదంతో 16వ లోక్‌సభ రద్దైంది.

రాష్ట్రపతితో భేటీకి ముందు మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో 16వ లోక్‌సభ రద్దుకు సంబంధించి కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఎన్డీఏ ప్రభుత్వానికి చివరి రోజు కావడంతో రామ్‌నాథ్ కోవింద్ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్‌ వారికి విందు ఇచ్చారు.

Modi resigns to pave way for next government

మరోవైపు శనివారం సాయంత్రం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. బీజేపీ కూటమిలోని అన్ని పార్టీల నేతలు భేటీకి హాజరుకానున్నారు. ఎన్డీఏ నేతగా ప్రధాని మోడీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా గెలిచిన ఎంపీలంతా ఈ నెల 25వ తేదీ సాయంత్రానికి ఢిల్లీ రావాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. 26వ తేదీన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+