'తల్లి'ని కలిసేందుకు ' యోగా'ను మానివేశాడు

తల్లిని కలుసుకొనేందుకుగాను ప్రధానమంత్రి మోడీ ఇవాళ యోగాను మానివేశాడు. ఉదయం పూట సోదరుడి ఇంట్లో ఉన్న తల్లిని కలుసుకొని ఆమెతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు.

గాంధీనగర్ :అమ్మను మించిన దైవం లేదు ఆత్మను మించి అర్థం లేదని ఓ కవి తల్లి గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే నానుడి ఉండనే ఉంది.అయితే దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన తల్లిని చూడాలని భావించాడు. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తోన్న మోడీ తన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.అయితే తన తల్లిని చూసేందుకుగాను యోగాను చేయకుండా తల్లి వద్దకు వెళ్ళి కొద్దిసేపు గడిపాడు

తన స్వంత రాష్ట్రం గుజరాత్ నరేంద్రమోడీ మంగళవారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అయితే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన గుజరాత్ కు చేరుకొన్నారు.

పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఆయనకు బిజీ షెడ్యూల్ ఉంది. దరిమిలా ఇంత దూరమొచ్చాను, కనీసం తల్లిని చూడాలని భావించాడు. వెంటనే ఆమె చూసేందుకు వెళ్ళాలని అనుకొన్నాడు.

వెంటనే తల్లి కలుసుకొనేందుకు మార్గాన్ని అన్వేషించాడు. తన ప్రోగ్రామ్ ను రద్దుచేసుకోవాల్సిన పరిస్థితులు లేవు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడ రద్దు చేసుకోకుండానే తల్లిని కలుసుకోవాలని భావించాడు , ఆ నిర్ణయాన్ని అమలుచేశాడు.

తల్లిని కలిసిన మోడీ

తల్లిని కలిసిన మోడీ

ఢిల్లీకి రాజైన ఓ తల్లికి కొడుకే అనే నానుడి మనందరికీ తెలిసిందే. ప్రధానమంత్రిగా మోడీ పనిచేస్తోన్న తన తల్లిని చూడాలనే కోరికతో ఆయన తన కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా తల్లిని కలుసుకొనే షెడ్యూల్ ను తయారు చేసుకొన్నాడు. ఈ మేరకు ఉదయంపూట క్రమం తప్పకుండా చేసే యోగాను ఆయన మానివేశారు. యోగాను మానివేసి తల్లిని కలుసుకొన్నారు. యోగాకు కేటాయించే సమయాన్ని తల్లి వద్ద గడిపేందుకు కేటాయించాడు ప్రధానమంత్రి మోడీ.

తల్లితో కలిసి బ్రేక్ ఫాస్ట్

తల్లితో కలిసి బ్రేక్ ఫాస్ట్

తన తల్లితో కలిసి మోడీ అల్పాహరం తీసుకొన్నారు.యోగాకు కేటాయించే సమయాన్ని తల్లివద్ద గడిపేందుకు ఆయన కేటాయించారు.సూర్యోదయానికి ముందుగానే ఆయన తల్లితో కలిసి అల్పాహరం తీసుకొన్నారు. ప్రతిరోజూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అల్పాహరం తీసుకొంటారు.అయితే తల్లితో కలిసి అల్పాహరం తీసుకోవడం గొప్ప అనుభూతిగా మోడీ అభిప్రాయపడ్డారు. ఆమెతో గడిపిన కాలం గొప్ప అనుభూతిని అనుభూతిని ఇస్తోందన్నారు.

రెండు మాసాల తర్వాత తల్లి వద్దకు మోడీ

రెండు మాసాల తర్వాత తల్లి వద్దకు మోడీ

గత ఏడాది డిసెంబర్ లో గుజరాత్ లో జరిగిన దీసా ర్యాలీ సందర్భంగా మోడీ తన తల్లిని కలుసుకొన్నారు.ఆ రోజు నుండి ఆమెను ఆయన కలుసుకోలేదు. అయితే ఇంతవరకు ఆమెను కలుసుకోలేదు.అయితే గుజరాత్ లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మోడీ తల్లిని కలిశాడు.

వైబ్రెంట్ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని

వైబ్రెంట్ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని

మంగళవారం నాడు గుజరాత్ లో వైబ్రెంట్ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు సుమారు ఐదు వందల సంస్థలకు చెందిన సిఇఓలు హజరుకానున్నారు. ఈ కార్యక్రమంతో పాటుగా గాంధీనగర్ రైల్వే స్టేషన్ లో రూ.250 కోట్లతో పునర్నిర్మాణ పనులను ఆయన సోమవారం నాడు ప్రారంభించారు. మంగళవారం నాడు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరుడు పంకజ్ మోడీ ఇంట్లో తల్లి నివాసం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+