Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీతోపాటు ప్రమాణ స్వీకారం: ప్రముఖులు(పిక్చర్స్)

న్యూఢిల్లీ: దాదాపు 30ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం కొలువుదీరింది. 45 మంది మంత్రులతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు. ఏడుగురిలో ఆరుగురు కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.

మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు తరలి వచ్చారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షలు కూడా వచ్చారు. నరేంద్ర మోడీతో పాటు కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర హోదా గల మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.

నరేంద్ర మోడీతో ప్రారంభమైన ప్రమాణ స్వీకారం జార్ఖండ్ పార్లమెంటు సభ్యుడు సుదర్శన్ భగత్‌తో ముగిసింది. ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సభ్యులకూ మంత్రివర్గంలో చోటు కల్పించారు. కాగా, మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలోని రాజకీయ, సినీ, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖులు హాజరయ్యారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధాన మంత్రిగా ప్రమాణం చేసిన నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం.

మోడీ అభివాదం

మోడీ అభివాదం

ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అభివాదం చేస్తున్న నరేంద్ర మోడీ

ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం

సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో భారత 15వ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తున్న దృశ్యం.

రాష్ట్రపతి అభినందనలు

రాష్ట్రపతి అభినందనలు

ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనకు అభినందనలు తెలియజేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

ప్రధాని మోడీతో రాష్ట్రపతి

ప్రధాని మోడీతో రాష్ట్రపతి

45 మంది మంత్రులతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు.

రాష్ట్రపతితో..

రాష్ట్రపతితో..

ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీతో కలిసి ఫొటోలు దిగిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సభ్యులు.

రాష్ట్రపతితో..

రాష్ట్రపతితో..

ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీతో కలిసి ఫొటోలు దిగిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సభ్యులు.

ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ఇతర సభ్యులు.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ. ఆయనకు ఆర్థిక శాఖను కేటాయించారు.

కేంద్రమంత్రులుగా ప్రమాణం

కేంద్రమంత్రులుగా ప్రమాణం

కేంద్రమంత్రులుగా ప్రమాణం చేస్తున్న మేనకా సంజయ్ గాంధీ, అనంతకుమార్, రవి శంకర్ ప్రసాద్, అశోక్ గజపతి రాజు పూసపాటి, అనంత్ గీతె, హర్షిమ్రత్ కౌర్ బాదల్, నరేంద్ర సింగ్ తోమర్, జౌల్ ఓరమ్, మోహన్ సింగ్, థావర్ చంద్ గెహ్లాట్, స్మృతీ ఇరానీ, హర్షవర్ధన్.

కేంద్రమంత్రులుగా ప్రమాణం

కేంద్రమంత్రులుగా ప్రమాణం

కేంద్రమంత్రులుగా ప్రమాణం చేస్తున్న రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, డివి సదానంద గౌడ, ఉమా భారతి, నజ్మా హెప్తుల్లా, గోపీనాథ్ ముండే, రాంవిలాస్ పాశ్వాన్, కల్రాజ్ మిశ్రా.

రాజ్‌నాథ్ సింగ్

రాజ్‌నాథ్ సింగ్

కేంద్రమంత్రిగా ప్రమాణం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్. ఆయనకు హోంశాఖను కేటాయించారు.

మోడీతో కేంద్రమంత్రులు

మోడీతో కేంద్రమంత్రులు

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు.

రాష్ట్రపతితో కేంద్రమంత్రులు

రాష్ట్రపతితో కేంద్రమంత్రులు

ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీతో కలిసి ఫొటోలు దిగిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సభ్యులు.

మోడీతో కేంద్రమంత్రులు

మోడీతో కేంద్రమంత్రులు

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, వెంకయ్య నాయుడు.

సార్క్ దేశాధి నేతలు

సార్క్ దేశాధి నేతలు

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీతో సార్క్ దేశాల అధినేతలు, ప్రతినిధులు.

చికిత్స కోసం తరలిస్తూ..

చికిత్స కోసం తరలిస్తూ..

ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఓ అతిథి ఒక్కసారిగా మూర్చపోవడంతో అతన్ని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం.

అంబానీ, అదానీ

అంబానీ, అదానీ

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.

సోనియాతో అద్వానీ

సోనియాతో అద్వానీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సంభాషిస్తున్న బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో..

ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కరచాలనం చేస్తున్న బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ.

రాజ్‌నాథ్ సింగ్

రాజ్‌నాథ్ సింగ్

కేంద్రమంత్రిగా ప్రమాణం చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్. ఆయనకు హోంశాఖను కేటాయించారు.

వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు

కేంద్రమంత్రిగా ప్రమాణం చేస్తున్న బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు.

ములాయంతో అమిత్ షా

ములాయంతో అమిత్ షా

ప్రమాణ స్వీకారోత్సవంలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో బిజెపి నేత అమిత్ షా.

మన్మోహన్‌తో రాజపక్ష

మన్మోహన్‌తో రాజపక్ష

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో మాట్లాడుతున్న శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష

మోడీతో రాజపక్ష

మోడీతో రాజపక్ష

భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీకి అభినందనలు తెలుపుతున్న శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్ష.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్, క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.

ఉద్దవ్ థాక్రే

ఉద్దవ్ థాక్రే

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే, అతని కుమారుడు ఆదిత్యా థాక్రే.

అనీల్ అంబానీ

అనీల్ అంబానీ

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీ, సినీ నటి పూనం ధిల్లాన్.

కిరణ్ ఖేర్

కిరణ్ ఖేర్

ప్రమాణ స్వీకారోత్సవంలో బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీతో కరచాలనం చేస్తున్న కిరణ్ ఖేర్.

ఆత్మీయ పలకరింపు

ఆత్మీయ పలకరింపు

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆత్మీయంగా పలకరిస్తున్న కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, ఉమా భారతి.

మేనకా గాంధీ

మేనకా గాంధీ

బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీతో కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ.

హేమా మాలిని

హేమా మాలిని

ప్రమాణ స్వీకారోత్సవంలో సినీ నటి, ఎంపి హేమామాలిని, నటి పూనం ధిల్లాన్.

సోనియా, రాహుల్

సోనియా, రాహుల్

మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.

మోడీ ప్రమాణం

మోడీ ప్రమాణం

సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో భారత 15వ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తున్న దృశ్యం.

మోడీ ప్రమాణం

మోడీ ప్రమాణం

సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో భారత 15వ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణం చేస్తున్న దృశ్యం.

సోనియా, రాహుల్

సోనియా, రాహుల్

మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+