Chandrayaan 3: జాబిల్లికి అతి సమీపం నుంచి క్లిక్.. విక్రమ్ పంపిన తొలి ఫొటో
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. కీలక దశకు చేరుకుంది. చందమామకు మరింత చేరవైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయిన విషయం తెలిసిందే. ఈ ల్యాండర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 18, 2023
View from the Lander Imager (LI) Camera-1
on August 17, 2023
just after the separation of the Lander Module from the Propulsion Module #Chandrayaan_3 #Ch3 pic.twitter.com/abPIyEn1Ad
తాజాగా ఈ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలాన్ని ఫొటో తీసింది. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన ఈ ఫొటోను తీసింది చంద్రయాన్ 3 ల్యాండర్. అతి సమీపం నుంచి జాబిల్లి ఉపరితలాన్ని క్లిక్‌మనిపించింది. ల్యాండర్‌కు అమర్చిన హై-డెఫినిషన్ కెమెరా తీసిన ఈ ఫొటోల్లో చందమామ ఉపరితలంపై ఉన్న కొండలు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఇమేజెస్ అన్నింటినీ కలిపి ఓ వీడియోను తయారు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. 31 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. గతంలో నాసా సహా వేర్వేరు దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ సంస్థలు గుర్తించిన ఎత్తయిన కొండలు, లోతైన అగాథాలు, వాటికి పెట్టిన పేర్లతో సహా ఈ వీడియోలో వివరించారు. ఫ్యాబ్రి, హర్ఖెబి జే, గెర్డానో బ్రూనో..లను గుర్తించారు.
కిందటి నెల 14వ తేదీన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 చందమామ వైపు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 2019లో చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో- ఈ మూన్ మిషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ఇస్రో.
చంద్రాయన్ 2 క్రాష్ ల్యాండింగ్‌కు గురైన విషయం తెలిసిందే. చంద్రుడిపై ల్యాండింగ్ చేసే సమయంలో దాని వేగాన్ని నియంత్రించడంలో ఇస్రో విఫలమైంది. ఫలితంగా వేల కిలోమీటర్ల వేగంతో నేరుగా చందమామ ఉపరితలాన్ని ఢీకొట్టింది. ముక్కలైపోయింది. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో జాగ్రత్తలను తీసుకున్నారు.
ఈ నెల 23వ తేదీన సరిగ్గా సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు చంద్రయాన్ 3.. జాబిల్లి మీద కాలు మోపుతుంది. ల్యాండింగ్ కోసం చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఎంచుకుంది ఇస్రో. ప్రయోగించిన తేదీ నుంచి 22 రోజుల్లో భూకక్ష్యను దాటుకుంది. తాజాగా చంద్రుడికి చేరవైంది. పేలోడ్‌గా పంపించిన ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ విడిపోయాయి.












Click it and Unblock the Notifications