• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టెక్కీలకు షాక్: ఐటీ సెక్టార్‌కు బ్యాడ్‌న్యూస్, రూపీ దెబ్బకు టీసీఎస్ ఢమాల్

By Narsimha
|

న్యూఢిల్లీ: ఐటీరంగానికి మరింత బ్యాడ్‌న్యూస్. గ్లోబల్ ఐటీ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ మరోసారి ఐటీ వ్యయాల వృద్ది అంచనాలను తగ్గించింది. డిజిటైజేషన్ ఆందోళనతో 2.7 శాతంగా అంచనావేసిన వ్యయాల వృద్దిని 2017లో 2.4 శాతానికి తగ్గిస్తున్నట్టు పేర్కొంది.

తొలుత ప్రపంచవ్యాప్తంగా ఐటీ వ్యయాల వృద్ది 3 శాతంగా గార్ట్నర్ అంచనా వేసింది. తర్వాత దీన్ని ఈ ఏడాది జనవరి సమీక్షలో 2.7 శాతానికి కుదించింది. భవిష్యత్తు ఐటీ ఇండస్ట్రీ వృద్దిపై ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో గార్ట్నర్ రెండోసారి ఈ ఏడాదిలో వ్యయాల వృద్ది అంచనాలను తగ్గించేసింది.

భవిష్యత్తు ఐటీ ఇండస్ట్రీ వృద్దిపై అంచనాలు పడిపోవడంతోపాటు ఆటోమేషన్ నేపథ్యంలో గార్ట్నర్ రెండోసారి ఈ ఏడాదిలో వ్యయాల వృద్ది అంచనాలను తగ్గించేసింది.

అదేవిధంగా వ్యయాల వృద్ది అంచనాలు పడిపోవడంతో పాటు ఆటోమేషన్ పెనుముప్పులా ముంచుకొస్తుండడం , రక్షణాత్మక ధోరణి భారత్‌లో ఉద్యోగాల కోతపై భయాందోళనను కల్గిస్తున్నాయి.

 ఎగుమతుల వృద్దిని తక్కువే

ఎగుమతుల వృద్దిని తక్కువే

155 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ సెక్టార్ ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడి ఉంది. నాస్కామ్ కూడ గత నెలలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వృద్దిని తక్కువగా 7-8 శాతంగానే అంచనావేసింది. ప్రస్తుత వ్యాపారాలకు డిజిటల్ బిజినెస్‌లు లోతైన ప్రభావం చూపుతున్నాయని గార్ట్నర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ డేవిడ్ లవ్‌లాక్ ఓ ప్రకటనలో తెలిపారు.

2016 కంటే వృద్ది అంచనాలు ఎక్కువే

2016 కంటే వృద్ది అంచనాలు ఎక్కువే

డిజిటల్ బిజినెస్‌లు, కొత్త కేటగిరిలు, సాఫ్ట్‌వేర్ ప్లస్ సర్వీసెస్, మేథోసంపత్తి హక్కుల్లో వృద్దికి దోహదం చేస్తాయన్నారు. అయితే గార్ట్నర్ ప్రస్తుతం అంచనావేసిన వ్యయాల వృద్ది అంచనాలు 2016లో సాధించిన దానికంటే 0.3 శాతం వేగవంతంగానే ఉన్నాయి. ఇది ఇండస్ట్రీని 4.477 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్తోందని గార్ట్నర్ భావిస్తోంది.

 రూపీ దెబ్బకు టీసీఎస్ డౌన్

రూపీ దెబ్బకు టీసీఎస్ డౌన్

రూపాయి విలువ పెరగడంతో దేశీయ అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 ఆర్థిక సంవత్సర జూన్ త్రైమాసిక ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను తప్పి క్వార్టర్ క్వార్టర్‌కు 10 శాతం పడిపోయింది. కంపెనీ నికరలాభాలు రూ.5,495 కోట్లుగా నమోదైందని కంపెనీ పేర్కొంది. కంపెనీ నికర లాభాలు రూ,6,203 కోట్లుగా ఉంటాయని విశ్లేషకులు అంచనావేశారు. కానీ, విశ్లేషకుల అంచనాలు తప్పాయి.

 భారీగా పడిపోయిన రెవిన్యూ

భారీగా పడిపోయిన రెవిన్యూ

రెవిన్యూ సైతం క్వార్టర్‌కు స్వల్పంగా 0.2 శాతం పడిపోయి రూ.29,584 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వచ్చాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుకు 7 రూపాయాల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్టు ఈ ఐటీ దిగ్గజం ప్రకటించింది. ఈ క్వార్టర్‌లో డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి విలువ పెరగడంతో రూ.650 కోట్లు నష్టపోయినట్టు కంపెనీ సిఎఫ్ఓ రామకృష్ణన్ ప్రకటించారు

 ఈబీఐటీ మార్జిన్లు 26.6 శాతానికి తగ్గుదల

ఈబీఐటీ మార్జిన్లు 26.6 శాతానికి తగ్గుదల

స్థిరమైన కరెన్సీ విలువల్లో రెవిన్యూ వృద్ది ఈ క్వార్టర్ లో 2 శాతం పెరిగింది. వాల్యూమ్ గ్రోత్ కూడ 3.5 శాతానికి పెరిగినట్టు కంపెనీ ఇవాళ బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్ లో పేర్కొంది.గత క్వార్టర్ లో 29.10 శాతంగా ఉన్న ఈబీఐటి మార్జిన్లు ఈ క్వార్టర్‌లో 26.6 శాతానికి పడిపోయాయి. 1 మిలియన్ బ్యాండ్ లో కంపెనీ 8 మంది క్లయింట్లను చేర్చుకోగా, 10 మిలియన్ బ్యాండ్ లో 12 మంది ఉన్నారు. కంపెనీలో మొత్తం ఉద్యోగులు 3,85,809 ఉన్నారు. గ్రాస్ ఆడిక్షన్ కింద 11,202 ఉద్యోగులున్నారు. అయితే గత ఆర్థికసంవత్సరంతో పోలీస్తే నియామకాలు తక్కువగానే ఉన్నాయని కంపెనీ ప్రకటించింది

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Global IT research firm Gartner today further lowered its 2017 IT spending growth estimate to 2.4 per cent from the 2.7 per cent earlier on worries on digitisation.The firm had first predicted for a 3 per cent growth in worldwide IT spends, which got revised down to 2.7 per cent in January this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more