వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో శానిటైజర్: యూజ్ చేస్తే ప్రార్థన మందిరం అపవిత్రం, ఇమామ్, కమిటీలకు ఆదేశాలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ జడలువిప్పి నాట్యం చేస్తోంది. దేశంలో రోజుకు 10 వేల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. వైరస్ ప్రబలకుండా ఉండాలంటే.. ఇంటిపట్టునే ఉండాలి. లేదంటే మాస్క్ వేసుకొని, విధిగా శానిటైజర్ పెట్టుకోవాలి. కానీ నిన్న మధురలో కొన్ని ప్రముఖ ఆలయాలు.. దేవాలయం ముందర శానిటైజర్‌తో శుభ్రం చేసేందుకు నో చెప్పాయి. ఆ మరునాడే యూపీలో బరేలీ ఇస్లాం ప్రముఖులు కూడా వంతపాడారు. ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్ వాడటం వల్ల మసీదు ప్రాంగణం అపవిత్రం అవుతోందని.. ఇమామ్‌లు శానిటైజర్‌తో క్లీన్ చేయొద్దని సూచించారు.

 తెలంగాణలో కొత్తగా 209 కరోనా కేసులు.. మరో 9 మంది మృతి.. తెలంగాణలో కొత్తగా 209 కరోనా కేసులు.. మరో 9 మంది మృతి..

 నో శానిటైజర్..

నో శానిటైజర్..

ఆలయాలు, ప్రార్థన మందిరాలను ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్లతో శుభ్రపరచాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో వైరస్ వ్యాప్తి తగ్గుతోందని పేర్కొన్నది. కానీ ఆల్ ఇండియా తంజీమ్ ఉలామా ఏ ఇస్లాం మాత్రం దానిని తప్పుపడుతోంది. ప్రధాన కార్యదర్శి మౌలానా షాహబుద్దీన్.. ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో మసీదు ప్రాంగణాన్ని క్లీన్ చేయొద్దని పేర్కొన్నారు. పవిత్రమైన స్థలంలో ఇలా అపవిత్ర జలంతో శుభ్రపరచడం నిషిద్దం అని పేర్కొన్నారు.

Recommended Video

Gairsain Declared Summer Capital Of Uttarakhand
సబ్బు, షాంపు..

సబ్బు, షాంపు..

ప్రార్థన మందిరాలు క్లీన్ చేసేందుకు ఓకే.. కానీ శానిటైజర్‌తో కాకుండా సబ్బు, డిటర్జెంట్‌తో కూడా చేయొచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తాము గౌరవిస్తామని.. కానీ అదే సమయంలో తమ సంప్రదాయాలు, విలువలను మరచిపోమని తెలిపారు. ఆల్కహాల్‌తో కూడిన వస్తువులు గానీ మసీదుకు వచ్చేవారు తీసుకోవడం గానీ ఇస్లాంలో నిషిద్దం అని పేర్కొన్నారు. మసీదుకు వచ్చి ప్రార్థనలు చేసే వారు... ఇంటి వద్దే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అపవిత్రం

అపవిత్రం

ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్ ఉపయోగిస్తే ఆ ప్రాంగణం అపవిత్రమైపోతుందని చెప్పారు. అపవిత్రమైన చోట ప్రార్థనలు చేయలేమని పేర్కొన్నారు. మసీదు ప్రాంగణంలో ఆల్కహాల్ పట్టుకున్న మహా పాపం అని చెప్పారు. అందుకే ఇమామ్, మసీదు కమిటీలు దీనిపై ఆలోచించాలని... సబ్బులు, షాంపులతో క్లీన్ చేయాలని మాత్రమే సూచించారు.

English summary
Muslim cleric in Bareilly has issued an advisory that cleaning of mosques should not be done with an alcohol-based sanitizer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X