వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే యోచనలో బ్యాంకులు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం సందర్భంగా ఎస్‌బిఐ తరహలోనే ఇతర బ్యాంకులు కూడ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి దిగ్గజ బ్యాంకుల మధ్య పోటీ కారణంగా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బ్యాంకుల అసెట్‌-లైబిలిటీ కమిటీలు త్వరలోనే సమావేశం కానున్నాయని సమాచారం.

తక్కువ వడ్డీరేట్లు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న పాత కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చనుందని తెలుస్తోంది. ఇటీవలనే ఎస్‌బిఐ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇదే బాటలో ఇతర బ్యాంకులు కూడ పయనించనున్నాయి.

Most banks set to follow SBI down rate cut path

ఎస్‌బీఐ తన బేస్‌ రేటును 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. దీంతో బేస్‌ రేటు ప్రస్తుతం 8.65 శాతానికి దిగివచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో కూడా ఎస్‌బీఐ 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.

పాలసీ రేట్లలో తగ్గింపును ప్రస్తుతం బ్యాంకులు తమ కస్టమకస్టమర్లకు బదిలీ చేస్తున్నాయని ఎస్‌బీఐ ఎండీ పీకే గుప్తా తెలిపారు. ప్రత్యర్థులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు బేస్‌ రేటు 8.85 శాతముండగా.. యాక్సిస్‌ బ్యాంకు రేటు 9 శాతం, బ్యాంకు ఆఫ్‌ బరోడా బేస్‌ రేటు 9.15 శాతం, పీఎన్‌బీ బేస్‌ రేటు 9.35 శాతం ఉన్నాయి. గత కొన్నేళ్ల క్రితం ప్రైమ్‌ లెండ్‌ రేట్లను అమలు చేయగా... ప్రస్తుతం మాత్రం బ్యాంకులు బేస్‌ రేట్లకు మారాయి.

English summary
Most big lenders such as ICICI Bank Axis Bank and HDFC Bank may follow State Bank of India in cutting rates for borrowers as competition intensifies among the country's biggest lenders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X