అమ్మ కానీ అమ్మ.. కోడలికి కొత్త జీవితాన్ని ఇచ్చిన అత్త
యశ్వంత్‌పుర : అత్త, కోడళ్లు అంటే నిత్యం పోట్లాటలే. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే సఖ్యంగా ఉంటారు. తల్లిలా చూసుకుంటామని, బిడ్డలా ఆదరిస్తామని మాటలే చెప్తారు. కానీ చేతలు వేరు. కానీ కర్ణాటకలో మాత్రం ఓ అత్త కోడలికి తల్లిలా మారింది. తల్లి చేయలేని పని కూడా చేసి ఆదర్శంగా నిలిచింది. పలువురి చేత శెభాష్ అనిపించుకుంటుంది.

కర్ణాటకలోని మంగళూరు జిల్లా సుళ్య తాలుకా కళంజ గ్రామానికి చెందిన సుశీల అదే ఊరికి చెందిన మాధవను పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత కాపురం సవ్యంగా సాగింది. గర్భవతై.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొన్నాళ్లకు మాధవ చనిపోయాడు. రోడ్డు ప్రమాదం కబళించడంతో భర్త దూరమయ్యాడు. దీంతో కోడలిని చూడలేకపోయింది అత్త. ఆమెకు మరో జీవితం ఇవ్వాలని భావించింది. మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది.
తనకు కొడుకు దూరం కాగా .. కోడలు సుశీలకు భర్త, బిడ్డకు తండ్రి దూరమయ్యాడని అత్త ఆలోచించింది. మరో పెళ్లి చేసుకోవాలని సూచించింది. అయితే ఇందుకు కోడలు ఒప్పుకోలేదు. కానీ తాను తల్లిలా మారి, నాలుగు మంచి మాటలు, భవిష్యత్ గురించి చెప్పింది. బంట్వాళ తాలుకా కన్యా గ్రామానికి చెందిన జయప్రకాశ్‌తో పెళ్లి జరిపించింది. దీనిని చూసిన పలువురు అత్త మంచి మనస్సును కొనియాడారు. కోడలు గురించి ఇంత ఆలోచించడం మంచి పరిణామామని పొగడ్తలతో ముంచెత్తారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications