'హెచ్1బీ వీసాల గడువు పొడిగించకపోతే అమెరికాకే నష్టం', కోర్టుకు టెక్ కంపెనీలు?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గ్రీన్ కార్డు కోసం ఎదరు చూస్తున్న హెచ్ 1 బీ వీసాదారులకు వీసాలను పొడిగించకూడదని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలనుకొంటున్న నిర్ణయం అమెరికాకు తీవ్రంగా నష్టం కల్గించే అవకాశం ఉందని నాస్కామ్ అభిప్రాయపడింది.

హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్: 7 లక్షల ఇండియన్స్‌పై ప్రభావం, ట్రంప్ షాక్‌తో స్వదేశానికేనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చుకొనే ప్రయత్నం చేశారు. హైర్ అమెరికన్, బై అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తీసుకువచ్చారు.

టెక్కీలకు షాక్: అమెరికా నుండి స్వదేశానికి వందలాది మంది ఇండియన్లు

టెక్కీలకు శుభవార్త: ఈ ఏడాది ఐటీలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు

అయితే అమెరికాలో తీసుకొస్తోన్న నిబంధనల ప్రభావం ఇండియా టెక్కీలపై పడుతోంది. ఈ నిర్ణయాలన్నీ ఇండియాతో పాటు అమెరికాపై కూడ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదని నాస్కామ్ అభిప్రాయపడింది.

ట్రంప్ నిర్ణయాలు అమెరికాకే నష్టం

ట్రంప్ నిర్ణయాలు అమెరికాకే నష్టం

గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు వారి వీసాలను పొడిగించకుండా డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యాలయం తీసుకొస్తున్న నిబంధనలు అమెరికాను భారీగా దెబ్బతీయనున్నట్టు నాస్కామ్‌ అభిప్రాయపడింది. ఒకవేళ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే, కేవలం దేశీయ ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపడం మాత్రమే కాకుండా... అమెరికా పోటీతత్వంపై భారీగా ప్రభావం చూపనుందని ప్రకటించింది.

అమెరికాలో ప్రతిభావంతులు తగ్గిపోనున్నారు

అమెరికాలో ప్రతిభావంతులు తగ్గిపోనున్నారు

గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న హెచ్ 1 వీసాదారులకు వారి వీసాలను పొడిగించకపోతే అమెరికాలో ప్రతిభావంతులైన నిపుణులు తగ్గిపోనున్నారని నాస్కామ్ అభిప్రాయపడింది. స్థానికంగా అన్ని రంగాల్లో ప్రతిభావంతులు దొరికే అవకాశాలు ఉండకపోవచ్చని నాస్కామ్ తెలిపింది.

అమెరికాలో ఆ స్కిల్స్ ఉన్నవారు తక్కువ

అమెరికాలో ఆ స్కిల్స్ ఉన్నవారు తక్కువ

అమెరికాలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మేథమేటిక్స్‌ స్కిల్స్‌ ఉన్న వారు అమెరికాలో తక్కువగా ఉన్నారని నాస్కామ్ అభిప్రాయపడింది. అందుకే బహుళ జాతీయ కంపెనీలు వేలమంది ప్రతిభావంతులైన ఉద్యోగులను హెచ్‌-1బీ వీసాలపై అమెరికాకు తీసుకెళ్తున్నాయని నాస్కామ్‌ ప్రకటించింది.

నిపుణుల కొరత అమెరికాలో ఎక్కువ

నిపుణుల కొరత అమెరికాలో ఎక్కువ

అమెరికాలో చాలా ఎక్కువగా నిపుణుల కొరత ఉంది. ఎస్‌టీఈఎం ఉద్యోగాల్లో ఖాళీ ఉన్న రెండు మిలియన్లలో, ఒక మిలియన్‌ ఉద్యోగాలు ఐటీకి చెందినవే. ప్రస్తుతం ట్రంప్‌ కార్యాలయం తీసుకుంటున్న చర్యలన్నీ, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనున్నాయని నాస్కామ్ ఛైర్మెన్ చంద్రశేఖర్ చెప్పారు.

కోర్టుకు వెళ్ళే యోచనలో టెక్ కంపెనీలు

కోర్టుకు వెళ్ళే యోచనలో టెక్ కంపెనీలు

ట్రంప్‌ కార్యాలయం తీసుకొస్తున్న ఈ నిబంధనలపై కోర్టుకు ఎక్కాలని టెక్‌ దిగ్గజాలు చూస్తున్నాయి. కేవలం దేశీయ ఐటీ కంపెనీలు మాత్రమేకాక, అమెరికా టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఐబీఎంలు కూడా తీవ్రంగా ప్రభావితం కానున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీల్లో పనిచేసే చాలా మంది హెచ్‌-1బీ వీసా ఉద్యోగులు, దశాబ్దం కింద నుంచి గ్రీన్‌ కార్డుల కోసం వేచిచూస్తున్నారని నిపుణులు చెప్పారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులను కాపాడుకోవడానికి అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంపెనీలు దావా దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Donald Trump administration's proposal to not extend H-1B visas of those waiting for their Green Cards if accepted, will have major ramifications for Indian IT professionals, IT industry body Nasscom said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి