అత్యాచారయత్నం... కొడవలితో కామాంధుడి మర్మాంగాలు కోసేసిన మహిళ... ఇద్దరిపై కేసు నమోదు...

తనపై బలత్కారం చేయబోయిన కామాంధుడి పట్ల గట్టిగా ప్రతిఘటించిన ఓ మహిళ కొడవలితో అతని మర్మాంగాలను కోసేసింది. రాత్రిపూట ఇంట్లోకి చొరబడ్డ ఆ కామాంధుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో గట్టిగా ప్రతిఘటించిన మహిళ కొడవలితో అతనిపై దాడి చేసింది. అనంతరం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఆ తర్వాత ఆమెపై కూడా కేసు నమోదు చేయడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని సిద్ది జిల్లాలో శనివారం(మార్చి 20) ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...


సిద్ది జిల్లాలోని ఉమారిహ గ్రామంలో ఓ మహిళ(45) తన భర్త,13 ఏళ్ల కుమారుడితో కలిసి నివసిస్తోంది. గురువారం(మార్చి 18) ఆమె భర్త ఏదో పని మీద వేరే ఊరికి వెళ్లాడు. రాత్రి పూట ఆమె,తన కుమారుడు ఇంట్లో నిద్రిస్తుండగా సరిగ్గా 11గంటల సమయంలో ఎవరో ఇంటి గోడ దూకినట్లు అలికిడి వినిపించింది. దీంతో ఉలిక్కిపడి లేచిన ఆమె కుమారుడు కంగారుపడ్డాడు. ఇంట్లో దొంగలు పడ్డారన్న భయంతో తలుపు తీసుకుని బయటకు పరిగెత్తాడు.

20 నిమిషాలు పెనుగులాట... ఆపై కొడవలితో...

20 నిమిషాలు పెనుగులాట... ఆపై కొడవలితో...

ఇదే క్రమంలో ఇంట్లోకి చొరబడ్డ నిందితుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు.ఆపై లైంగిక దాడికి యత్నించాడు. దాదాపు 20 నిమిషాల పాటు అతనితో ఆమె తీవ్రంగా పెనుగులాడింది. ఇదే క్రమంలో మంచం కింద ఉన్న కొడవలి అందుకున్న ఆమె... అతని మర్మాంగాలను కోసేసింది. ఆ ఘటన తర్వాత అర్ధరాత్రి 1.30గం. సమయంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రెవా జిల్లాలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీలో అతను చికిత్స పొందుతున్నాడు.

ఇరువురిపై కేసు నమోదు...

ఇరువురిపై కేసు నమోదు...

నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354,456,294 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కూడా ఆమెపై ఫిర్యాదు చేశాడని... అతని ఫిర్యాదు మేరకు ఆమెపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ముంబైలో ఓ మహిళ(42) ఓ యువకుడి మర్మాంగాలు కోసేసిన ఘటన సంచలనం రేకెత్తించింది. తనను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్న అతన్ని... ఓ ప్రదేశంలో కలుసుకుందామని పిలిచి కత్తితో అతని మర్మాంగాలు కోసేసింది. మరో ఇద్దరు స్నేహితుల సహాయంతో ఆమె ఈ దాడికి పాల్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+