Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ధోనీ బర్త్‌డే స్పెషల్- పెంపుడు జంతువుల మధ్య కేక్ కట్

రాంచీ: టీమిండియా మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 42వ ఏట అడుగుపెట్టాడు. శుక్రవారమే పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకొన్నాడు. దేశవ్యాప్తంగా ధోనీ భాయ్ అభిమానులు కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ధోనీ పోస్టర్లు, కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి అతీతం కాదు. రెండు చోట్లా భారీ కటౌట్లు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌తో పాటు నందిగామల్లో అతని అభిమానులు 50 అడుగుల ఎత్తు గల కటౌట్లను నెలకొల్పారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ధోనీ బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోలేదు ఫ్యాన్స్. ఏ ఏడాదికి ఆ ఏడాది ధోనీ పుట్టినరోజు నాడు జరిగే కోలాహలం రెట్టింపవుతూనే వస్తోంది.

MS Dhoni

ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఓ స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఒకరిద్దరు మినహా ఆ స్థాయిలో ఫ్యాన్ బేస్ మరో క్రికెటర్‌కు లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్, ఇమేజ్ వేరు.

MS Dhoni

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గకపోవడం ధోనీకి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పకనే చెబుతోంది. మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2007లో టీ20 ఇంటర్నేషనల్స్ ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టుకు అందించాడు. ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్‌నూ అదే స్థాయిలో నిలబెట్టాడు.

MS Dhoni

కాగా- ఇవ్వాళ రెండోసారి తన పుట్టినరోజును జరుపుకొన్నాడు ధోనీ. ఇది అతని పెట్స్ కోసం. పెంపుడు జంతువుల మధ్య పుట్టినరోజును జరుపుకొన్నాడివ్వాళ. పెంపుడు జంతువులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. కేక్ కట్ చేశాడు. వాటికి కేక్ ముక్కలను ఆప్యాయంగా తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెంపుడు జంతువులపై అతనికి ఉన్న మమకారాన్ని చాటుతోందీ వీడియో.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+