జూనియర్ డాక్టర్‌ను రేప్ చేసిన డాక్టర్: సాక్ష్యాలతో సహా భర్తను పట్టించిన భార్య!

ముంబై: డాక్టర్ ఉద్యోగం చేస్తూ భర్త సాగించిన కీచకపర్వాన్ని సాక్షాత్తూ అతని డాక్టరు భార్య బయటపెట్టిన బాగోతం మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో వెలుగుచూసింది. ముంబై నగరంలో డాక్టర్ అజయ్ సింగ్, డాక్టర్ శ్వేత దంపతులు నివాసం ఉంటున్నారు. అజయ్ సింగ్ మాహింలోని రహేజా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు.

జూనియర్ తో పబ్ లో !

జూనియర్ తో పబ్ లో !

డాక్టర్ అజయ్ సింగ్ తన వద్ద జూనియర్ డాక్టరుగా పనిచేస్తున్న ఓ యువతిని అక్టోబర్ నెలలో పబ్ కు తీసుకువెళ్లి ఆమెతో మద్యం తాగి ఆపై క్వార్టర్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని, చంపేస్తానని డాక్టర్ అజయ్ సింగ్ బాధితురాలిని ఫోన్ లో బెదిరించాడు.

భర్త మొబైల్ లో స్పై సాఫ్ట్ వేర్

భర్త మొబైల్ లో స్పై సాఫ్ట్ వేర్

భర్త డాక్టర్ అజయ్ సింగ్ ప్రవర్తనపై అనుమానంతో అతని భార్య డాక్టర్ శ్వేతా ఓ ప్లాన్ వేసింది. భర్త అజయ్ సింగ్ మొబైల్ ఫోన్ లో స్పై సాప్ట్ వేర్ వేసి అతనికి వచ్చే ఫోన్ కాల్స్, వీడియోలు, ఫోటోలపై డాక్టర్ శ్వేతా నిఘా పెట్టింది.

బాధితురాలిని ప్రశ్నించిన భార్య

బాధితురాలిని ప్రశ్నించిన భార్య

బాధిత జూనియర్ డాక్టరుతో భర్త అజయ్ సింగ్ ఫోన్ లో సాగించిన వాగ్వాదం, ఫోటోలు అతని భార్య డాక్టర్ శ్వేతాకు కనిపించాయి. బాధిత యువతికి ఫోన్ చేసిన శ్వేతా ఏం జరిగింది అని నిలదీసింది. భయపడిన బాధితురాలు ఎంఐడీసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి ఎంఐడీసీ పోలీసులు

రంగంలోకి ఎంఐడీసీ పోలీసులు

ముంబైలోని ఎంఐడీసీ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా డాక్టర్ అజయ్ సింగ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ప్రముఖ డాక్టర్ అజయ్ సింగ్ అసలు విషయం తెలుసుకున్న పోలీసులు సాక్ కు గురైనారు.

భర్త కీచకపర్వంపై భార్య సాక్షం

భర్త కీచకపర్వంపై భార్య సాక్షం

భర్త అజయ్ సింగ్ సాగించిన కీచకపర్వంపై భార్య శ్వేతా సేకరించిన ఆధారాలను ఎంఐడీసీ పోలీసులకు అందించింది. సాక్షాత్తూ భార్య శ్వేతాను సాక్షిగా పెట్టుకున్న పోలీసులు ఆమె అందించిన ఆధారాలతోనే కేసు నమోదు చేసి డాక్టర్ అజయ్ సింగ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+