కుటుంబ కలహాలు: మౌనం వీడిన ములాయం రెండో భార్య
ములాయం కుటుంబంలోని గొడవలపై ఆయన రెండో భార్య సాధన తొలిసారి పెదవి విప్పారు. అఖిలేష్ గురించి కూడా ఆమె మాట్లాడారు...
లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన వివాదంపై ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన యాదవ్ తొలిసారి పెదవి విప్పారు. ఎస్పీలో తలెత్తిన అధిపత్య పోరు, ములాయం సింగ్‌పై అఖిలేష్ యాదవ్ తిరుగుబాటు, పార్టీ పగ్గాలు చేపట్టడం వంటి పలు పరిణామాలపై ఆమె మాట్లాడారు.
నెల రోజుల క్రితం ములాయం కుటుంబంలో తలెత్తిన విభేదాలకూ తాను ఏ మాత్రం కారణం కాదని ఆమె తెలిపారు. అఖిలేష్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ములాయం కుటుంబంలో విభేదాలు తెలెత్తడం తనను ఎంతగానో బాధించిందని, అయితే ఇందుకు తానెవరినీ నిందించడం లేదని అన్నారు.
రామ్‌గోపాల్ యాదవ్ ములాంయకు చాలా సన్నిహితుడని, వారిద్దరి మధ్య ఏమి జరిగిందో తెలియదని అన్నారు. రామ్‌గోపాల్ భార్య చనిపోయినప్పుడు ఆయనను తాను ఓదార్చినట్లు తెలిపారు. ఆయన కుమారుడు వివాహం సమయంలో అక్కడే ఉండి సహాయం చేశానని అన్నారు.

ఆయన్ను అవమానించకుండా ఉండాల్సింది...
ఎన్ని జరిగినా పార్టీ వ్యవస్థాపకుడైన ములాయంను అవమానించకుండా ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. శివపాల్ యాదవ్‌ను కూడా అవమానించి ఉండరాదని, ఆయన చేసిన తప్పేమీ లేదని ఆమె అన్నారు. ములాయంకు, పార్టీకి శివపాల్ ఎంతో సేవ చేశారని అన్నారు.

అఖిలేష్ యాదవ్ గురించి...
అఖలేష్ యాదవ్ గురించి కూడా సాధనా యాదవ్ మాట్లాడారు. అఖిలేష్‌ను ఎవరో తప్పుదోవ పట్టించారని, అఖిలేష్ ఎప్పుడూ ములాయంకు, తనకు ఎంతో గౌరవం ఇచ్చేవాడని తెలిపారు. అఖిలేష్‌ను తాను ఒక కొడుకుగానే చూసేదాన్నని చెప్పారు. సవతి కొడుకుగా ఎప్పుడూ చూడలేదని అన్నారు.

నేను రావడం నేతాజీకి ఇష్టం లేదు...
తాను ఎన్నో త్యాగాలు తాను చేశానని, భగవంతుడికి అన్నీ తెలుసునని సాధన యాదవ్ అన్నారు. ములాయం సింగ్ యాదవ్‌కు తాను రాజకీయ సలహాలు ఇచ్చేదాన్నని చెప్పారు. తన కుమారుడు ప్రతీక్ రాజకీయాల్లోకి రావాలన్నదే తన కోరికని, అయితే తాను మాత్రం ఎన్నడూ రాజకీయాల్లోకి రానని, ములాయంకు కూడా తాను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని సాధనా యాదవ్ చెప్పారు.

అలా జరగాల్సింది కాదు...
ములాయం కుటుంబంలో అలా జరిగి ఉండాల్సింది కాదని సాధనా యాదవ్ అన్నారు. ములాయం కుటుంబ సభ్యులకు తాను ఎల్లవేళలా సాయం చేసినట్లు ఆమె తెలిపారు. గత ఐదేళ్లలో కన్నా జనవరి 1వ తేదీ నుంచి తాను అఖిలేష్‌తో ఎక్కువగా మాట్లాడినట్లు ఆమె తెలిపారు. అఖిలేష్ గెలిచి, ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకున్నట్లు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications