పోలీసునంటూ అశ్లీల ఫొటోలు తీసి.. మోడల్‌ని దోచేశాడు

Subscribe to Oneindia Telugu

ముంబై: తాను పోలీసునంటూ ఓ మోడల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అంతేగాక, ఆమె వద్ద ఉన్న నగదు, నగలు దోచేసుకుని పారిపోయాడు. ఆ తర్వాత కూడా డబ్బులు చెల్లించాలని, లేదంటే సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని కటకటాల వెనక్కి నెట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంబీఏ పూర్తి చేసిన సుదీప్ బిశ్వాల్ అనే యువకుడు ముంబైలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పనిచేస్తున్నాడు. తాను ఓ మంచి మోడల్ కోసం వెతుకుతున్నానని, ఇంటర్వ్యూకు రావాలని ఒక మోడల్‌కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతడి వద్దకు వెళ్లగానే బెదిరింపులకు గురిచేశాడు.

Mumbai: 'Cop' molests, robs model in 5-star hotel room

తాను ఒక పోలీసు అధికారినని పరిచయం చేసుకున్నాడు. 'మోడల్ ముసుగులో ఉన్న నువ్వు చాలా కాలంగా వ్యభిచారం చేస్తున్నావని నా వద్ద సమాచారం ఉంది. మంచితనంగా నేను చెప్పింది చెయ్. నీ దగ్గరున్న డబ్బు నగలు నాకు ఇచ్చేయ్' అని అన్ని తీసుకోవడంతోపాటు ఆ మోడల్ తో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.

బలవంతంగా ఆమె అభ్యంతరకర ఫొటోలు తీశాడు. అనంతరం ఆమెకు అంతకు ముందు ఓ నటితో ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు లక్ష చెల్లించాలని, లేదంటే కటకటాలపాలు చేస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు గత ఏప్రిల్ నెలలో అతడికి తన వద్ద ఉన్నవన్ని ఇచ్చేసింది.

ఆ తర్వాత కూడా అతడు వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని ట్రాప్ చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 25-year-old man, who holds an MBA degree and works for a five-star hotel, was recently arrested for allegedly molesting a model at a plush hotel in Nariman Point.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి