బాలీవుడ్ డైరెక్టర్‌ను చంపడానికి కుట్ర!: ముంబై మోడల్‌కు జైలు శిక్ష

Subscribe to Oneindia Telugu

ముంబై: బాలీవుడ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ హత్య కేసులో దోషులకు ముంబై కోర్టు శిక్ష విధించింది. హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ముంబై మోడల్ ప్రీతి జైన్ పై అభియోగాలు నిరూపణ కావడంతో.. కోర్టు ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

ప్రీతి జైన్ తో పాటు ఆమెకు సహకరించిన నరేశ్ పరదేశి, శివరామ్ దాస్ లకు కూడా కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడం గమనార్హం. కాగా, 2005లొ మధుర్ భండార్కర్ ను హత్య చేయించడానికి గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీ అనుచరుడు నరేష్ పరదేశితో ప్రీతి డీల్ కుదుర్చుకుంది.

Mumbai Model Preeti Jain Convicted For Plot To Kill Filmmaker Madhur Bhandarkar

ఒప్పందం ప్రకారం నరేష్ కు రూ.75లక్షలు ముట్టజెప్పింది. డబ్బులు తీసుకున్న నరేష్, మధుర్ భండార్కర్ ను మాత్రం హత్య చేయలేదు. దీంతో ఇద్దరి మధ్య పేచీ మొదలైంది. తన డబ్బు తనకు ఇచ్చేయాల్సిందిగా నరేష్ ను డిమాండ్ చేసింది. మొత్తం విషయం గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీకి తెలియడంతో.. పోలీసులకు అతను సమాచారం అందించాడు.

దీంతో ప్రీతితో పాటు నరేశ్, శివరామ్ లపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన విచారణను శుక్రవారం పూర్తి చేసిన కోర్టు.. ముగ్గురికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉంటే, 2006లొ మధుర్ భండార్కర్ పై ప్రీతి జైన్ రేప్ కేసు పెట్టింది. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని నమ్మించి.. తనను శారీరకంగా వాడుకున్నాడని అప్పటి ఫిర్యాదులో పేర్కొంది. తదనంతరం 2012లో ప్రీతి కేసును విత్ డ్రా చేసుకోవడంతో కోర్టు ఈ కేసును కొట్టివేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mumbai-based model Preeti Jain has been sentenced to three years in jail after being found guilty of plotting to kill filmmaker Madhur Bhandarkar, whom she had accused of rape.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి