ఎలాంటి ఆధారాలు లేవు.. మీటూ కేసులో నానాపటేకర్‌కు పోలీసులు క్లీన్‌చిట్..
ముంబై : లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌కు ముంబై పోలీసులు క్లీన్‌చిట్ దొరికింది. పదేళ్ల క్రితం హారన్ ఓకే ప్లీజ్ సినిమా సెట్‌లో ఆయన తనను వేధించారంటూ నటి తనుశ్రీ దత్తా ఏడాది క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు బుక్ చేసి విచారణ చేపట్టిన పోలీసులు నానా పటేకర్ తప్పు చేశారనడానికి ఎలాంటి సాక్ష్యాలు దొరకలేదని స్థానిక న్యాయస్థానంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు బీ రిపోర్ట్ సమర్పించడంతో పటేకర్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చే అవకాశముంది.

నానా పటేకర్‌కు పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంపై తను శ్రీ దత్తా తరఫు న్యాయవాది స్పందించారు. సాక్ష్యాలు లేవన్న కారణంతో కేసును మూసివేశారని, దానిపై తనుశ్రీ ప్రొటెస్ట్ రిపోర్ట్ దాఖలు చేస్తారని చెప్పారు. పోలీసులు కేసు మూసేసినా మరింత లోతైన విచారణ జరిపే అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టును కోరే అవకాశం ఉంటుందని అన్నారు. ఇదిలా ఉంటే నానా పటేకర్‌కు భయపడి కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు తమకు మద్దతివ్వడం లేదని తనుశ్రీ ఈ మధ్య ఆరోపించారు. తనుశ్రీ ఆరోపణలపై నానా పటేకర్ గతంలోనే తనుశ్రీ దత్తాకు నోటీసులు పంపారు. రాతపూర్వకంగా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications