ఆ ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్.. 8 గంటలుగా.. వెళ్లారో ఇక అంతే..!

వీకెండ్ కారణంగా ఆ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 7-8 గంటలుగా వాహనాలు కదలని పరిస్థితి నెలకొంది. శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైన ట్రాఫిక్.. శనివారం ఉదయానికి మరింత విస్తరించింది. నేషనల్ హైవే పై ట్రాఫిక్ ఏర్పరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన గూగుల్ మ్యాప్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాల్లో కిలోమీటర్ల మేర వరకూ రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి. ప్రయాణ సమయం ఏడు నుంచి ఎనిమిది గంటల మేర ఆలస్యం అవుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Mumbai-Pune Highway Nightmare 8-Hour Traffic Jam Hell

ప్రధాన నగరాలైన హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్ కతా లాంటి ప్రాంతాల్లో నిత్యం ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ముంబై- పూణే జాతీయ రహదారిలో భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. గూగుల్ లో ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే పై కిలోమీటర్ల మేర రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన చిత్రాలను ఫుల్ ట్రాఫిక్ ఫెస్టివల్ అన్న హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ మరింత రద్దీగా ఉంది. దీంతో వేల మంది వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.

ఇందుకు సంబంధించిన చిత్రాలను రిషికేష్ అగేర్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. ట్రాఫిక్ జామ్ చిత్రాలకు ఉన్నతాధికారులను ట్యాగ్ చేశాడు. ఈ ట్రాఫిక్ జామ్ లో తాను సబ్ స్క్రిప్షన్ తీసుకున్నట్లు సెటైరికల్ గా రాసుకొచ్చాడు. ఓల్డ్ అండ్ న్యూ ముంబై- పూణే హైవేలు.. ఘాట్ ప్రాంతాల్లో రద్దీగా ఉన్నట్లు రిషికేష్ మరో పోస్టులో పేర్కొన్నాడు. వీకెండ్స్ లో ఈ హైవేలు అత్యంత రద్దీగా ఉంటాయని స్పష్టం చేశాడు. అయితే ఘాట్ సెక్షన్స్ లో ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో ఇంజిన్ టెంపరేచర్, క్లచ్ ప్లేట్స్ ను మానిటరింగ్ చేయాలని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. అలాగే వీకెండ్ లో ప్రయాణాలు చేసేవాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+