Special Marriage Act: ఈ చట్టం వైపు ముస్లిం సమాజం ఎందుకు చూస్తోంది..?

Special Marriage Act:ముస్లిం వారసత్వ చట్టంలోని కొన్ని షరతులను పరిష్కరించడానికి ప్రత్యేక వివాహ చట్టం (SMA) కింద ముస్లిం సమాజంలోని ఎక్కువ మంది సభ్యులు వివాహాలను నమోదు చేస్తున్నారు. కాసరగోడ్ మరియు త్రిస్సూర్ జిల్లాల్లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నుండి వచ్చిన డేటాను పరిశీలిస్తే గత సంవత్సరంలో 277 SMA (Special Marriage Act) రిజిస్ట్రేషన్‌లు జరిగినట్లు తెలుస్తోంది. త్రిస్సూర్‌లోని అంతికాడ్ నుంచి అత్యధికంగా 80 నమోదు అయ్యాయి.

SMA రిజిస్ట్రేషన్లలో పెరుగుతున్న ట్రెండ్

నటుడు మరియు న్యాయవాది సి షుకూర్ ఆయన భార్య, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మాజీ ప్రో-వైస్ ఛాన్సలర్, షీనా ఈ విధానాన్ని హైలైట్ చేశారు. వారు వివాహం చేసుకున్న 29 సంవత్సరాల తర్వాత మార్చి 2023లో SMA కింద మళ్లీ వివాహం చేసుకున్నారు. తాను జనవరి 1, 2020 నుండి జూన్ 2024 వరకు SMA వివాహాల వివరాలను RTI కింద కోరినట్లు షుకూర్ వెల్లడించారు. 2023 మార్చి నెల తర్వాత SMA కింద నమోదైన రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పెరిగాయని షుకూర్ చెప్పారు.

కాసర్‌గోడ్ జిల్లాలో 133 వివాహాలు SMA కింద నమోదవగా, త్రిస్సూర్‌లో 144 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆడపిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాలు తమ కుమార్తెలకు వారసత్వంగా ఆస్తిని అందజేయడానికి SMAను ఎంచుకుంటున్నాయని షుకూర్ పేర్కొన్నారు. కేరళ రాష్ట్రం నుంచే కాకుండా విదేశాల నుంచి అంటే అమెరికా గల్ఫ్ దేశాల నుంచి కూడా దీని గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు.

ఎవరి అభ్రిప్రాయం ఎలా ఉంది..?

స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చాలా మంది వివాహాలను రిజిస్టర్ చేసుకోవడాన్ని ముస్లిం పెద్దలు స్వాగతిస్తూనే.. ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి దీనిపై వారి అభిప్రాయం బహిరంగంగా చెప్పేందుకు వెనకాడుతున్నారు. ఈ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు.

సామాజిక కార్యకర్త ఎంఎన్ కరాస్సేరి SMA రిజిస్ట్రేషన్ల వైపు మళ్లడాన్ని స్వాగతించారు. షరియత్‌లో పూర్వీకుల ఆస్తిపై పురుషులకు మహిళలకు సమాన హక్కు లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ అన్యాయాన్ని పరిష్కరించడానికి ప్రత్యేక వివాహ చట్టం కింద నమోదు చేయడమే తక్షణ పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.

సమాన వారసత్వ హక్కుల కోసం పిలుపు

లింగ వివక్ష లేకుండా సమాన వారసత్వ హక్కులు, ట్రాన్స్‌జెండర్లను చేర్చుకోవాలని ప్రగతిశీల ముస్లిం మహిళా సంఘం NISA అధినేత్రి వీపీ సుహ్రా డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, 'సమానతా ఉద్యమం'లో భాగంగా అక్టోబర్ 2న ఎర్నాకుళంలో SMA ఆధ్వర్యంలో వివాహం చేసుకున్న జంటల కోసం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని షుకూర్ యోచిస్తున్నారు.

ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్ 1937 ప్రకారం తండ్రికి కొడుకు లేకపోతే, అతని ఆస్తిలో మూడింట రెండొంతులు అతని కుమార్తెలకు, మిగిలిన మొత్తం అతని సోదరులకు చెందుతుంది. ఈ అసమానతను తొలగించడంలో SMA వంటి చట్టపరమైన ప్రత్యామ్నాయాలు రావడం చాలా కుటుంబాలకు మేలు కలిగించే మార్గంలా కనిపిస్తోంది.

స్థానం వివాహాల సంఖ్య
పజయన్నూర్ 13
ఎరుమపెట్టి 7
అన్నమనాడ 7
అండతోడు 12
అంతికాడ్ 80
కున్నంకుళం 18
ముల్లస్సేరి 1
కాటూరు 6

మొత్తానికి తమ కుమార్తెలకు ఆస్తిలో సమాన హక్కు కలగాలని కోరుతూ చాలామంది ముస్లింలు SMA కింద వివాహాలను నమోదు చేసుకుంటున్నారు. పైన పొందుపర్చిన డేటాను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతోంది. లింగ సమానత్వం ఉండాలనే ధోరణి ముస్లిం సామాజిక వర్గంలోనే కనిపిస్తుండటం శుభపరిణామం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+