సల్మాన్ ఖాన్ షేవింగ్ చేసుకోలేదని, జీన్స్, టీ షర్టు వేసుకోలేదని భార్య ఏం చేసిందంటే?

లక్నో: నీట్ గా షేవింగ్ చేసుకుని ఉండాలని, అందరిలాగా అందంగా ఉండాలని భార్య చెప్పడంతో అందుకు నిరాకరించిన ముస్లీం భర్త మీద సలసల కాగే వేడీనీళ్లు పోయ్యడంతో అతని ముఖం గుర్తు పట్టలేని విధంగా కాలిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

ఆలీగడ్ లో నివాసం ఉంటున్న సల్మాన్ ఖాన్ (32) అనే యువకుడి ముఖం కాలిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. ఆలీగడ్ లో సల్మాన్ ఖాన్ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతను చిన్నప్పటి నుంచి ఇస్లాం మతాన్ని గౌరవిస్తున్నాడు.

నగ్మా అనే మహిళతో సల్మాన్ ఖాన్ వివాహం అయ్యింది. సల్మాన్ ఖాన్ గుబురుగా గడ్డం పెంచుకుని కుర్తా, ఫైజామా వేసుకుంటున్నాడు. సల్మాన్ ఖాన్ భార్య మాత్రం అత్యాధునిక జీవనశైలికి ప్రధాన్యత ఇస్తోంది. తాను అందరిలాగా స్వేచ్చగా తిరగాలని నగ్మా అంటోందని సమాచారం.

Muslim man refuses to shave beard, wife throws boiling water on him in Aligarh

గడ్డం కత్తరించి నీట్ గా షేవింగ్ చేసుకుని జీన్స్ ప్యాంట్, టీ షర్టు వేసుకోవాలని భర్త సల్మాన్ ఖాన్ కు చెప్పింది. అయితే గడ్డం తీసి జీన్స్ ప్యాంట్, టీషర్టు వేసుకోవడానికి సల్మాన్ ఖాన్ నిరాకరించాడు. ఎంత చెప్పినా భర్త వినకపోవడంతో సహనం కొల్పోయిన నగ్మా సలసల కాలుతున్న వేడి నీళ్లు తీసుకుని భర్త ముఖం మీద పోసింది.

దాదాపుగా ముఖం కాలిపోవడంతో సల్మాన్ ఖాన్ ఆసుపత్రికి పరుగు తీశాడు. తన భార్య నగ్మా నా ముఖం మీద వేడినీళ్లు పోసిందని సల్మాన్ ఖాన్ ఫిర్యాదు చేశాడని పోలీసులు చెప్పారు. బాధితుడు ఆలీగడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+