Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైరల్‌ వీడియో: ఇదేం పిచ్చి పని.. కారులో నగ్నంగా మహిళ విన్యాసాలు..

సామాజిక మాధ్యమాల ప్రభావం రానురాను ప్రజలపై విపరీతంగా పడుతోంది. రీల్స్, షార్ట్స్ కోసం కొందరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. నడి రోడ్డుపై వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరు రైల్వే స్టేషన్లలో.. రైల్వే ట్రాక్స్ వద్ద విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆకతాయిల భరతం పట్టేందుకు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకున్నా వీళ్లు మాత్రం అలాగే రెచ్చిపోతున్నారు.

ఇటీవల హైదరాబాద్ లో ఓ యువకుడు.. తన లవర్ ను ముందు కూర్చొబెట్టుకుని డ్రైవింగ్ చేశాడు. తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

అయితే తాజాగా ఇలాంటి ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తున్న కారులో ఓ మహిళ అందరికీ షాక్ ఇచ్చింది. ఆ మహిళ నగ్నంగా కనిపించింది. కారు విండో నుంచి బయటికి వంగి మరీ అసభ్యకరంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ కారు వెనకనుంచే వెళ్తున్న మరో కారు డ్యాష్ బోర్డ్ కెమెరాలో ఈ వీడియో రికార్డు అయింది.

Naked Nightmare on Shaheed Path Woman Strips amp amp Stunts from Speeding Car in Lucknow Viral Horror

ఈ వీడియోపై నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను యూపీ ఖబర్ అనే వ్యక్తి ఇన్ స్టా లో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. లక్నో లో ఇలాంటి ఘటనలు ఈ మధ్య మరింతగా పెరిగిపోయాయని ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. అమ్మాయి అయి ఉండి నడిరోడ్డుపై ఇలాంటి ఘటనలకు పాల్పడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+