నల్గొండ ఎన్‌కౌంటర్: అప్పుడే పారిపోయి జల్సాలు, తండ్రి బాధ (పిక్చర్స్)
నల్గొండ: ఇలాంటి కొడుకును కన్నందుకు బాధగా ఉందని నల్గొండ జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సిమి ఉగ్రవాది మహ్మద్ ఎజాజుద్దీన్ తండ్రి అజీజుద్దీన్ మంగళవారం అన్నారు. కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఆయన నార్కట్‌పల్లి వచ్చారు. ఎన్‌కౌంటర్‌లో కొడుకు మృతిచెందిన సంఘటన పర్యవసానంగా చోటు చేసుకున్న పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఏ తండ్రీ కూడా ఇలాంటి తప్పును క్షమించడని, ఎజాజ్ ప్రవర్తన వల్ల మేము కూడా ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డామని, గడిచిన ఐదేళ్లుగా ఎజాజ్ మాతో సంబంధాలు తెంచుకుని దూరంగా ఉంటున్నాడని చెప్పారు. చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయాడని చెప్పారు. తండ్రి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే జులాయి తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు.

ఊహ తెలియగానే ఇంటి నుండి పారిపోయాడు. తన కొడుకు ఇంట్లో పెరగలేదని చెప్పారు. సిమి కార్యకర్తగా పని చేస్తూ ఉగ్రవాదిగా మారిన విషయం తెలియదన్నారు. ఇలాంటి కొడుకను కనాలని ఎవరు అనుకోరన్నారు. ఎజాజుద్దీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఎజాజ్ తండ్రి, సోదరులకు అప్పగించారు.
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన ఎజాజ్ మృతదేహాన్ని తీసుకెళ్లాల్సిందిగా అతని తండ్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ జిల్లా నిశాంత్‌పూర్ గ్రామానికి చెందిన మహ్మద్ అజీజుద్దీన్‌కు నల్గొండ పోలీసు శాఖ సమాచారమిచ్చింది. దీంతో తండ్రి అజీజుద్దీన్ తోపాటు తమ్ముడు మహ్మద్ అజారుద్దీన్, సమీప బంధువు మహ్మద్ అంజద్, ఖాండ్వా సీఐ నరేందర్ యాదవ్, ఇతర పోలీసు అధికారులతో కలిసి నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి చేరుకున్నారు.

చిన్నప్పుడు వరికోత మిషన్‌లో పడి తెగిన ఎడమచేతి చూపుడు వేలు ఆధారంగా మరణించినది తన కుమారుడు ఎజాజుద్దీనే అని అతడి తండ్రి గుర్తించారు. ఇక, ఎజాజ్‌తోపాటు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అస్లాం దేహం ఇంకా మార్చురీలోనే ఉంది. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా మధ్యప్రదేశ్‌లోని అతని కుటుంబసభ్యులకు, అధికారులు సమాచారం ఇచ్చినా తీసుకెళ్లటానికి వారు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications