అజిత్ పవార్ కంగ్రాట్స్.. మహారాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై ప్రధాని మోడీ భరోసా..
మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా శనివారం తెల్లవారు జామున ప్రమాణ స్వీకారం చేయడం దేశ రాజకీయాలను వేడెక్కించాయి. అనూహ్య సంఘటనపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన నరేంద్రమోడీ కొత్తగా ఏర్పాటైన మహారాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు అందించారు. ప్రధాని మోడీ తన సందేశంలో ఏమన్నారంటే..

సుస్థిర ప్రభుత్వం కోసం
డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత ఏ ఒక్కరికి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ప్రస్తుతం మహారాష్ట్రలో రైతుల సమస్యతోపాటు అనేక అంశాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. అందుకే స్థిరమైన ప్రభుత్వం కోసం బీజేపీతో చేతులు కలిపాను అని అన్నారు.

శివసేన మాట మార్చిందని
మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీని ఇచ్చారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన ఇతర పార్టీలతో కలిసి మా అలయెన్స్‌కు తూట్లు పొడిచింది. దాంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మహారాష్ట్రకు స్థిరమైన ప్రభుత్వం ఉండాలనే ఆలోచనతో అజిత్ పవార్ మాతో కలిశారు అని అన్నారు.

సీఎం, డిప్యూటీ సీఎంకు కంగ్రాట్స్
సీఎంగా, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవీస్, అజిత్ కంగ్రాట్స్. వారిద్దరు మహారాష్ట్రకు బంగారు భవిష్యత్‌ను అందిస్తారనే విషయంలో నమ్మకంగా ఉన్నారు. వారిద్దరూ కలిసి సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్తారు అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రధానితో హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సోషల్ మీడియాలో ఇద్దరికి శుభాకాంక్షలు అందజేశారు.

అసెంబ్లీలో బలాబలాలు
మహారాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సీఎం ఫడ్నవీస్‌కు గవర్నర్ సూచించారు. ప్రస్తుతం బీజేపీకి 105 సీట్లు, ఎన్సీపీకి 54 సీట్లు ఉన్నాయి. అజిత్ మద్దతుతో ప్రభుత్వా ఏర్పాటుకు కావాల్సిన 144 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. తాజా పరిణామాల మధ్య ఎన్సీపీ ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలుపుతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications