జాతీయ స్థాయి షూటర్ సిప్పీ సిద్దు దారుణ హత్య

చండీగడ్: జాతీయ స్థాయి షూటర్ ను దారుణంగా కాల్చి చంపిన సంఘటన చండీగడ్ లో జరిగింది. అనేక సంవత్సరాల నుంచి షూటింగ్ లో పలు పతకాలు సాధించిన షార్ప్ షూటర్ సిప్పీ సిద్దు (34) హత్యకు గురైనాడని మంగళవారం పోలీసులు చెప్పారు.

చండీగడ్ లోని సెక్టార్ 27 లోని ఓ పార్క్ లో ఆదివారం రాత్రి 11 గంటలకు మృతదేహాన్ని గుర్తించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తుపాకి తూటాలకు అతను బలి అయ్యాడని కేసు నమోదు చేశారు.

National level shooter murdered in Chandigarh

తరువాత హత్యకు గురైయ్యింది జాతీయ స్థాయి షూటర్ సిప్పీ సిద్దు అని గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఉన్నత కుటుంబంలో జన్మించిన సిద్దు న్యాయవాదిగా పని చేస్తున్నాడు. అదే విధంగా ఆయన స్పోర్ట్స్ ప్రమోటర్.

2001 నేషనల్ గేమ్స్ లో షూటింగ్ టీమ్ ఈవెంట్ లో సిద్దు, అభినవ్ బింద్రా కలిసి స్వర్ణం సాధించారు. 15 ఏళ్లుగా షూటర్ గా కొనసాగుతున్నాడు. పలు పోటీల్లో పాల్గోని అనేక పతకాలు సాధించాడు. అయితే సిద్దు హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. సిద్దు మృతికి పలువురు షూటర్లు సంతాపం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+