బీజేపీ మెరుపు నిర్ణయాలు: కొత్త ముఖ్యమంత్రి ఎంపిక
Haryana next CM: భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న హర్యానాకు కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పని చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్.. తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త సారథిని ఎన్నుకోవాల్సి వచ్చింది.
ఖట్టర్ రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఖాళీని లోక్‌సభ సభ్యుడు నాయబ్ సింగ్ సైనీతో భర్తీ చేసింది బీజేపీ హైకమాండ్. ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఈ మేరకు చండీగఢ్‌లో బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో ఈ ప్రక్రియ పూర్తయింది. నాయబ్ సింగ్ పేరును ఎమ్మెల్యే కిషన్ లాల్ మిధ్నా ప్రతిపాదించారు. అనంతరం మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.

బీజేపీ- జన్‌నాయక్ జనత పార్టీ కూటమి ప్రభుత్వానికి ఈ ఉదయం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఖట్టర్ నాయకత్వాన్ని మిత్రపక్షం జన్‌నాయక్ జనతా పార్టీ వ్యతిరేకించడమే దీనికి ప్రధాన కారణం. జేజేపీ తన మద్దుతను ఉపసంహరించుకుంటే బీజేపీ ప్రభుత్వం కుప్పకూలుతుంది.
సకాలంలో దీన్ని నివారించగలిగింది బీజేపీ అధిష్ఠానం. యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. మనోహర్ లాల్ ఖట్టర్‌తో రాజీనామా చేయించింది. ఈ వ్యవహారంతో హర్యానాలో రాజకీయ సంక్షోభం ఏర్పడినట్లు కనిపించినప్పటికీ- సకాలంలో జోక్యం చేసుకుని దీన్ని తప్పించింది.
ఖట్టర్ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే కొత్త ముఖ్యమంత్రిని సైతం ఎన్నుకుంది బీజేపీ. నాయబ్ సింగ్ సైనీ పేరును ప్రతిపాదించింది. దీనికి బీజేఎల్పీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం హర్యానా రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్నారాయన. కురుక్షేత్ర లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ముఖ్యమంత్రిగా ఈ సాయంత్రం లేదా గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications