Neet 2024 results: నీట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ (NEET UG 2024) పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం.. మే 12న విడుదల చేయాల్సిన ఈ ఫలితాలను.. మంగళవారం సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు వెల్లడించారు. ఇటీవల ప్రిలిమినరీ కీ విడుదల చేసి మే 31వ తేదీన రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్ అభ్యంతరాలు స్వీకరించిన విషయం తెలిసిందే.
తాజాగా, ఫలితాలు, ఫైనల్ కీని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నీట్ అభ్యర్థులు exams.nta.ac.in/NEETలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు. ఫలితాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లో వారి ఫోటో బార్ కోడ్‌ను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల కోసం NEET అధికారిక వెబ్‌సైట్ Exams.nta.ac.in/NEET UG ను సంప్రదించాలి.

ఈ ఫలితాలను neet.ntaonline.inలో కూడా చూడవచ్చు. స్కోర్ కార్డును పొందేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ను భారతదేశంలోని 14 నగరాలో 557 కేంద్రాల్లో నిర్వహించారు. 24 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
NEET స్కోర్‌కార్డ్‌ను ఇలా తనిఖీ చేయండి
స్టెప్ 1: ముందుగా NTA NEET అధికారిక వెబ్‌సైట్ nta.ac.inకి వెళ్లండి.
స్టెప్ 2: ఇప్పుడు హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న NEET ఫలితాల లింక్ exams.nta.ac.in/NEETపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు లాగిన్ వివరాలను ఇక్కడ నమోదు చేసి సమర్పించండి.
స్టెప్ 4: ఇప్పుడు మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
స్టెప్ 5: స్కోర్‌కార్డ్, డౌన్‌లోడ్ పేజీని తెరిచి.. దానిపై మీ ఫోటో, బార్ కోడ్‌ను తనిఖీ చేయండి.












Click it and Unblock the Notifications