ఈ స్టిల్స్ ఎవరివో చెప్పనక్కర్లేదు..!!

తమిళనాట వినాయక చవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభం అయ్యాయి. ప్రతి ఏటా ఈ పండుగ సీజన్‌లో విభిన్నమైన రూపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. సమకాలీన సమాజంలో ప్రజాదరణ పొందిన అంశాలను ప్రతిబింబించేలా విగ్రహాలను మలచడం కళాకారుల ప్రత్యేకత. ఈ ఏడాది చెన్నైలోని ఆర్ కే నగర్ కొరుక్కుపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు సాధారణ భక్తులతో పాటు సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోన్నాయి.

ముఖ్యమంత్రి విజయ్ శైలిలో రూపొందించిన వినాయకుడి విగ్రహాలు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాయి. విజయ్ స్ఫూర్తితో రూపొందించిన గణేషుడి మండపాన్ని నెలకొల్పారు కొరుక్కుపేట అభిమానులు. అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా మెడ వద్ద కుడిచేత్తో ఇచ్చిన ఓ సిగ్నేచర్ థీమ్ తో ఇక్కడి విగ్రహం రూపుదిద్దుకుంది. బ్లాక్ కలర్ ప్యాంట్, దానిపై అదే రంగు బ్లేజర్ ధరించిన విజయ్ గతంలో ఈ స్టిల్ ఇచ్చారు అసెంబ్లీలో.

New CM Vijay Inspired Vinayaka Idols Installed in Chennai RK Nagar Inspired by Stills along Ghilli

అది ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. అదే థీమ్ తో ఇక్కడి వినాయకుడి విగ్రహాన్ని రూపొందించారు. అలాగే- ఎన్నికల ప్రచార సమయంలో సైకిల్ తొక్కినప్పటి స్టిల్ ను కూడా గణేషుడి విగ్రహంగా మారింది. టీవీకే పతాకంలోని రంగులతో కూడిన కండువా ధరించిన వినాయకుడు సైకిల్ తొక్కుతున్న స్టిల్ లో తయారైంది. ఇవి.. రాజకీయానికి మాత్రమే పరిమితం కాలేదు. మూవీ స్టిల్ లో కూడా విగ్రహం రూపుదిద్దుకుంది.

కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి ట్రావెల్ చేసిన గణపయ్య
కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి ట్రావెల్ చేసిన గణపయ్య

విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ.. ఘిల్లి. మహేష్ బాబు ఒక్కడు ఫిల్మ్ కు రీమేక్ ఇది. ఇందులో కబడ్డీ ఆడే స్టిల్ లో కూడా గణేషుడి విగ్రహం తయారైంది. తమిళనాడులో సినిమా రంగానికి, ప్రత్యక్ష రాజకీయాలకు అత్యంత బలమైన అనుబంధం ఉంటుంది. అది.. ఈ ఉత్సవాల వేళ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మండపాన్ని వీక్షించడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తోన్నారు. విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

గతంలోనూ తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ అగ్ర నటుల శైలిలో గణపతి విగ్రహాలను తయారు చేసిన సందర్భాలు లేకపోలేదు. ఈ సారి విజయ్ విగ్రహాలు వెలిశాయి. వీటికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. స్థానిక ఉత్సవ కమిటీ నిర్వాహకులు కూడా ప్రజల ఆసక్తికి తగ్గట్టుగా సమాజంలో నడుస్తున్న సమకాలీన విషయాల ఆధారంగా విగ్రహాల రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తోన్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+